డొక్కు చాపర్.. అంతరిక్ష ఆయుధం.. అధ్యక్షుడి మరణంలో మహా కుట్రలు?

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ చాపర్ పేరు బెల్‌ 212. అయితే, ఇది 1979కి ముందు కొనుగోలు చేసింది.

Update: 2024-05-21 07:37 GMT

సహజంగా ఏదైనా దేశాధినేతలు, అధ్యక్షులు అకాల మరణం పాలైతే.. అనేక అనుమానాలు తలెత్తుతాయి. తాజాగా సంభవించిన ఘోర ప్రమాదం వెనుక కూడా ఇలాంటివే వస్తున్నాయి. దాదాపు 45 ఏళ్ల కిందటి హెలికాప్టర్.. ఓ అత్యాధునిక అంతరిక్ష ఆయుధం.. అన్నిటికిమించి వారసత్వ పోరు.. కారణంగానే ఆయన బలయ్యారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో న్రధానమైనవి..

1) ఒక చాపర్.. 45 ఏళ్లుగా వాడకం

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ చాపర్ పేరు బెల్‌ 212. అయితే, ఇది 1979కి ముందు కొనుగోలు చేసింది. అంటే 45 ఏళ్ల కిందటిది అన్నమాట. ఈ రోజుల్లో ఒక వాహనాన్ని పదేళ్లు వాడడమే ఎక్కువ. ఇలాంటివాటిని సరుకు రవాణాకూ వినియోగించరు. కానీ, ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ 45 ఏళ్ల కిందటిది అంటే పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. దీంతోనే ఇరాన్‌ వాయు రవాణా భద్రత చరిత్ర చాలా పేలవం అని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఇరాన్ సంపన్న దేశమే. కానీ, దానిపై అమెరికా ఆంక్షలు ఉన్నాయి. దీంతో విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలు, పాత వాటికి విడి భాగాల సేకరణ కష్టమైంది. ఇరాన్‌ విమానయాన, హెలికాప్టర్‌ సంస్థలు.. తమ దగ్గరున్నవాటిలో కొన్నిటిని భాగాలుగా విడగొట్టి, మిగతావాటికి అమరుస్తున్నాయి. రివర్స్‌ ఇంజినీరింగ్‌ పద్ధతిలో ఇరానే కొన్ని భాగాలను తయారు చేస్తున్నా.. వాటి నాణ్యత ప్రశ్నార్థకం. ఇలాంటి వాహనానికి ప్రతికూల వాతావరణం తోడవడంతో కుప్పకూలింది.

2) ఆకాశం నుంచి ఆయుధం..

అత్యాధునిక లేజర్‌ బీమ్‌ ను అంతరిక్షం నుంచి ప్రయోగించి కూడా రైసీ హెలికాప్టర్ ను కూల్చివేశారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై ట్విటర్ లో ప్రచారం జరుగుతోంది. పలు దేశాలు ఇలాంటి ఆయుధాలను వాడుతున్నాయి కూడా. అయితే, ఇరాన్ ప్రభుత్వం మాత్రం అదేమీ లేదంటోంది.

3) వారసత్వ పోరు..

హోదా ప్రకారం ఇరాన్ కు అధ్యక్షుడు ఉంటారు. కానీ, సుప్రీం లీడర్ మాటనే చెల్లుబాటు అవుతుంది. కాగా, 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆయతుల్లా ఖొమేనీ సుప్రీం లీడర్ అయ్యారు. ఇప్పుడు అలీ ఖమేనీ ఉన్నారు. సుప్రీం లీడర్ కావాలని రైసీ భావించారు. ఆయనే ముందంజలో ఉన్నారు కూడా. కానీ, ఖమేనీ కుమారుడు ముజ్తబా కూడా సుప్రీం లీడర్ అవ్వాలనుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రైసీ దుర్మరణం చర్చనీయాంశం అవుతోంది. రైసీ-ముజ్తబా మధ్య ఆధిపత్య పోరు అందరికీ తెలిసిందే. 'రైసీ మరణంతో ఖమేనీ వారసత్వం ముజ్తబాకే' అంటూ అమెరికా విదేశాంగ శాఖ మాజీ సలహాదారు గాబ్రియన్‌ నోర్నహ ట్వీట్ చేయడం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే, రైసీ మరణంపై ప్రజలు ఆందోళన చెందొద్దంటూ 85 ఏళ్ల ఖమేనీ ప్రకటించడం మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది. ని చెప్పడానికి కూడా వారి అనుమానాలు దూరం చేయడానికే అనిపిస్తోందన్నారు. ప్రస్తుతం ఖమేనీ వయస్సు 85 ఏళ్లు . ఇక రైసీ స్థానంలో తాత్కాలిక బాధ్యతలు తీసుకొన్న మహమ్ముద్‌ ముఖ్‌బెర్‌ మరో 50 రోజులు ఆ పదవిలో కొనసాగనున్నారు.

4) ఇజ్రాయెల్, అమెరికా పన్నాగమా?

ఇరాన్ ను డర్టీ కంట్రీగా చూసే అమెరికా, శత్రవుగా భావించే ఇజ్రాయెల్ లు రైసీ దుర్మరణం వెనుక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇరాన్ అణు సైంటిస్ట్ మొహసీన్‌ ఫక్రిజాదను ఇజ్రాయెల్‌ అడ్వాన్డ్ రోబోలతో చంపేసిది. ఇరాన్ అణు కేంద్రంలో పరికరాలను కూడా ధ్వంసం చేసింది. రైసీనీ ఇలాగే చంపేసిందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ మాజీ మంత్రి మహమ్మద్‌ జావెద్‌ జారిఫ్‌ అయితే.. తమ హెలికాప్టర్లకు విడి భాగాలు కొనకుండా ఆంక్షలు విధించి అమెరికానే రైసీని చంపిందని అంటున్నారు.

ప్రమాదానికి ''బెల్''...

రైసీ ప్రయాణించిన హెలికాప్టర్‌ బెల్‌-212.(ప్రస్తుతం బెల్‌ టెక్స్‌ట్రాన్‌). ఇరాన్ లో ఇస్లామిక్ విప్లవానికి మందు అంటే.. 1979కు ముందు దీన్ని అప్పటి రాజు షా మహ్మద్‌ రెజా పహ్లావీ కొనుగోలు చేశారు. దృశ్య స్పష్టత ఉన్నప్పుడే ఇది ప్రయాణించగలదు. పైలట్ సీటు నుంచి పరిసరాలను చూడగలిగే సామర్థ్యంపైన ఆధారపడి మాత్రమే నడపగలరు.

Tags:    

Similar News