శరవేగంగా కాషాయ పతనం

బీజేపీకి కంచుకోట లాంటి స్టేట్ ఉత్తర ప్రదేశ్ లోనే 80 సీట్లకు 33 సీటలు బీజేపీ పడిపోయినపుడే అసలైన పతనానికి అడుగులు పడ్డాయి.

Update: 2024-10-05 19:30 GMT

కాషాయం పార్టీ పతనం వేగంగా సాగుతోందా అంటే ఒక్కో రాష్ట్రంలో ప్రజల నాడిని చూసినా ఫలితాల సరళిని చూసినా అదే నిజం అనిపిస్తోంది అంటున్నారు. ఈ విషయం లోక్ సభ ఎన్నికల్లోనే తేటతెల్లమైంది. బీజేపీకి కంచుకోట లాంటి స్టేట్ ఉత్తర ప్రదేశ్ లోనే 80 సీట్లకు 33 సీటలు బీజేపీ పడిపోయినపుడే అసలైన పతనానికి అడుగులు పడ్డాయి.

ఇక లోక్ సభ ఎన్నికల తరువాత జరిగిన పన్నెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికల్లో బీజేపీ చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా మిగిలింది. ఇపుడు లేటెస్ట్ గా బీజేపీ జారుడు మెట్ల మీద ఉందని నిరూపించేలా రెండు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి.

నిజానికి ఈ ఫలితాల కంటే ముందు అంచనాలు అలాగే ఉన్నాయి. కాశ్మీర్ లో బీజేపీకి ప్రజలు చాన్స్ ఇవ్వరని కూడా భావించారు. అలాగే రెండు సార్లు అధికారంలో ఉంటూ పదేళ్ళ పాటు పవర్ చాలాయించిన బీజేపీకి కాంగ్రెస్ నుంచి హర్యానాలో గట్టి పోటీ ఉందని కూడా అంతా అనుకున్నారు.

అదే నిజం అని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. ఇక ఎగ్జాట్ పోల్స్ ఈ నెల 8న అధికారికంగా తేల్చాల్సి ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇప్పటికి ఉన్న అంచనాల మేరకు బీజేపీ ఈ రెండు రాష్ట్రాలలో అధికారం మీద ఆశలు వదిలేసుకోవచ్చు అని అంటున్నారు.

అదే జరిగితే బీజేపీకి డేంజర్ బెల్స్ మోగినట్లే అని అంటున్నారు. వరసబెట్టి మరి కొన్ని చోట్ల ఎన్నికలు వివిధ రాష్ట్రాలలో జరగనున్నాయి. అందులో మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఈ నెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. నవంబర్ లో ఆ ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండు చోట్ల కూడా బీజేపీకి పెద్దగా ఆశలు లేవు అని అంటున్నారు. ఈ రెండు చోట్ల బీజేపీ ఓటమి పాలు అయితే మాత్రం కాషాయం ప్రతిష్ట మరింత దిగజారుతుంది.

ఇక 2025లో మరో రెండు రాష్ట్రాలకు ఎన్నికలు ఉన్నాయి. ఆ ఏడాది మొదట్లో ఢిల్లీకి ఎన్నికలు ఉంటే చివరిలో బీహార్ కి ఎన్నికలు ఉన్నాయి. ఈ రెండింటిలోనూ బీజేపీకి ఇబ్బందులే అని కూడా అంటున్నారు. ఇలా వరసబెట్టి ఏడాది వ్యవధిలో ఆరు రాష్ట్రాలలో బీజేపీ దెబ్బలు తింటే కాషాయం పార్టీ పతనం అంచుల మీద నిలబడినట్లే అని కూడా అంటున్నారు.

ఈ కధ అక్కడితో ఆగదు, 2026లో చూస్తే పశ్చిమ బెంగాల్ తో పాటు, ఉత్తర ప్రదేశ్ తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. ఇలా దేశంలో వరసబెట్టి ఒక్కో రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోతే ఆ రాష్ట్రాలను ఇండియా కూటమి గెలుచుకుంటే కనుక అపుడు దేశ రాజకీయామే పూర్తిగా మారుతుంది అని అంటున్నారు. 2029లో బీజేపీ ఎన్డీయే మిత్రులతో అయినా అధికారంలోకి వస్తుందా అన్న ఇపుడే మొదలు కావడం విశేషం.

అయితే మరో వైపు చూస్తే అంతదాకా ఎన్డీయే కూటమి ప్రభుత్వం మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉంటుందా అన్నది కూడా మరో రకమైన చర్చగానే ఉంది. ఏది ఏమైనా బీజేపీ మీద జనాలకు మోజు తీరుతున్నట్లే కనిపిస్తోంది. అదే సమయంలో మోడీ ఇమేజ్ కూడా కాశ్మీర్ లో మంచులా కరిగిపోతోంది అని అంటున్నారు. మొత్తానికి దేశ రాజకీయాలు కమలానికి ప్రతికూలంగా మారుతున్నాయన్న చర్చ అయితే సాగుతోంది. బీజేపీ కానీ మాతృ సంస్థ ఆరెస్సెస్ కానీ ఈ పరిస్థితిని అడ్డుకోవడానికి ఏమి చేస్తుంది అన్నదే చూడాల్సి ఉంది.

Tags:    

Similar News