గూగుల్ కేరాఫ్ వైజాగ్...కూటమిదే క్రెడిట్

ఈ ఆరు నెలలలో భారీ అచీవ్ మెంట్ గా విశాఖకు గూగుల్ ని రప్పించడాన్ని చూస్తున్నారు.

Update: 2024-12-12 03:48 GMT

అవును. ఇది నిజం. ఇదే అద్భుతం. ఎక్కడ గూగుల్ ని ఎక్కడికి తెచ్చారు అంటే అది కచ్చితంగా టీడీపీ కూటమి ప్రభుత్వానికే క్రెడిట్ అని అంటున్నారు. ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది.ఈ ఆరు నెలలలో భారీ అచీవ్ మెంట్ గా విశాఖకు గూగుల్ ని రప్పించడాన్ని చూస్తున్నారు.

ఇంతటి రేర్ ఫీట్ ని సాధించి హీరో అయింది మాత్రం మంత్రి నారా లోకేష్. అందుకే కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనను అభినందించారు. చంద్రబాబు అభినందనలు అంత ఈజీగా దక్కవు. ఎంత కొడుకు అయినా ఆయనను మెప్పించడం సాధ్యం కాదు. కానీ నారా లోకేష్ మాత్రం తండ్రి మెప్పు పొందారు అంటే గ్రేట్ అనాలి.

ఇదిలా ఉంటే దేశ విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం జోరు బాగా ప్రదర్శిస్తోంది. దానికి భారీ ప్రతిఫలం కూడా దక్కింది. ఇక బుధవారం ఏపీకి గొప్ప శుభవార్త. విశాఖకు అది తీయని వార్త.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం, గూగుల్ ప్ర‌తినిధుల మ‌ధ్య అత్యున్న‌త స్థాయి స‌మావేశంతో ఒప్పందం కుదరడం ద్వారా గొప్ప అడుగు పడినట్లు అయింది. గూగుల్ తో ఈరోజు కూటమి ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా కొత్త శకాన్ని ఆవిష్కరించింది.

ఈ ఒప్పందం ద్వారా గూగుల్ క్లౌడ్ ద్వారా నిర్వహించబడే వైజాగ్‌లోని ప్రతిపాదిత ఏఐ డేటా సెంటర్‌కు సంబంధించిన వ్యవహారాలను చూడబడతాయి. ఇక భారతదేశంలో తన టెక్ డ్రైవ్‌లో భాగంగా గూగుల్ ఏపీకి తరలివస్తోంది అని అంటున్నారు.

ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాల మూలంగానే పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దీని వల్ల ఉపాధి అవకాశాలు మెరుగు కావడమే కాకుండా అభివృద్ధికి కూడా మార్గం ఏర్పడుతోందని అంటున్నారు.

ఇక బికాష్ కోలే నేతృత్వంలోని గూగుల్ ప్రతినిధి బృందం ఏపీ సీఎం బాబుని కలుసుకుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో కీలక భాగస్వామిగా తమను గుర్తించినందుకు గర్వంగా ఉందని గూగుల్ ప్రతినిధులు అనడం కూడా విశేషం.

మరో వైపు చూస్తే అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజమైన గూగుల్ వంటి సంస్థ ఏపీకి రావడం అంటే కూటమి సాధించిన భారీ విజయం గానే చూస్తున్నారు. గూగుల్ రాక ఇతర ప్రముఖ కంపెనీలను సైతం ఏపీకి తీసుకుని రావడానికి దోహదపడుతుందని అంటున్నారు. మరో వైపు టీడీపీ కూటమి టెస్లాతో కూడా చురుకుగా చర్చలు జరుపుతోందని దాంతో ఏపీకి ఆ సంస్థ కూడా రావడం తథ్యమని అంటున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు లక్కీ అని అంటున్నారు అంతా. బాబు విజన్ తోనే అది సాధ్యపడుతోందని అంటున్నారు.

Tags:    

Similar News