కాంగ్రెస్ బ్యాడ్ లక్.. ఆ 31 స్థానాలు గెలిచి ఉంటే..?
ఎంతో చాలెంజ్‌గా తీసుకొని ప్రచారం చేసినప్పటికీ ఆ స్థాయిలో ఫలితాలు సంతృప్తి పరచలేదనే చెప్పాలి.
నిన్న వెలువడిన రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అదృష్టమే.. దురదృష్టమో కానీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. రెండు రాష్ట్రాల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఎంతో చాలెంజ్‌గా తీసుకొని ప్రచారం చేసినప్పటికీ ఆ స్థాయిలో ఫలితాలు సంతృప్తి పరచలేదనే చెప్పాలి.
ఒక్క రాష్ట్రంలోనూ అధికారం చేపట్టని కాంగ్రెస్ నిన్నటి ఫలితాల్లో తనదైన స్థాయిలో సత్తాచాటింది. హర్యానాలో బీజేపీ విజయం సాధించినప్పటికీ చాలా చోట్ల కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు చూస్తే అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. అక్కడి ఓటు షేరింగ్ రిలీజ్ కాగా.. కాంగ్రెస్‌కు ఆ గణాంకాలు ఎంతగానో ఊరటనిచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 31 స్థానాలను కేవలం 1000లోపు ఓట్లతోనే కోల్పోవడం గమనార్హం. మరింత ఆందోళన కలిగించే అంశం ఏంటంటే 18 స్థానాలను కేవలం 500 కంటే తక్కువ ఓట్ల తేడాతో కోల్పోయింది.
హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి సొంతంగానే అంతోఇంతో సత్తాచాటింది. ఇక మరో 31 స్థానాల్లో వెయ్యి కంటే తక్కువ ఓట్లతో ఓడిపోవడం ఆ పార్టీ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఇక 18 స్థానాల్లో కేవలం 500 లోపు ఓట్లతో ఓడిపోవడం మరీ దారుణమనే చెప్పాలి. ఒకవేళ వీటిలో మరో సగం సీట్లు వచ్చినా కాంగ్రెస్ పరిస్థితి మరొలా ఉండేది. రాష్ట్రంలో లార్జెస్ట్ పార్టీగా అవతరించి అధికారం చేపట్టే అవకాశాలు మెండుగా ఉండేవి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్లుగా కాంగ్రెస్‌కే గెలుపు అవకాశాలు ఉండేవి. దాంతో ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీ కూడా జీర్ణించుకోలేకపోతోంది. ప్రారంభంలో కాంగ్రెస్ గెలుపు దిశగా వెళ్లినప్పటికీ మధ్యలో అనూహ్యంగా బీజేపీ రేసులోకి వచ్చింది. దాంతో అప్పటివరకు సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలంతా ఒక్కసారిగా నిరాశ చెందారు.
అయితే.. కాంగ్రెస్‌కు ఇలాంటి ఫలితాలు రావడంపై ఆ పార్టీ పెద్దల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన జైరాం రమేష్ ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. గెలిచేందుకు బీజేపీ ఏమైనా చేయగలదని చెప్పుకొచ్చారు. ప్రతీ సర్వేలోనూ కాంగ్రెస్ గెలుపు ఖాయమంటూ చెప్పాయని, అంతటి తుఫానులో కాంగ్రెస్ ఎలా ఓడిపోయిందంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే.. కాంగ్రెస్ నేత ఆరోపణలు ఈసీ కూడా దీటుగా బదులిచ్చింది. ఇక.. కాంగ్రెస్ వైఫల్యం వెనుక పోల్ మేనేజ్‌మెంట్ కూడా ఓ కారణమని తెలుస్తోంది.