Begin typing your search above and press return to search.

మోడీ మీకిది తగునా...పేద వాళ్ళ డబ్బులు బిలియనీర్స్ కి ఇస్తారా ?

పన్నుల రాయితీలను బడా వ్యక్తులకు ఇస్తూ పేదలకు మాత్రం న్యాయం చేయడం లేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   2 Dec 2024 4:26 PM GMT
మోడీ మీకిది తగునా...పేద వాళ్ళ డబ్బులు బిలియనీర్స్ కి ఇస్తారా ?
X

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పేదల నుండి పన్నుల ద్వారా వసూలు చేసిన డబ్బులను పెద్దలకు బిలియనీర్లకు ఇస్తోంది అని అంటున్నారు. రాజకీయ పరిశీలకులు, ఆర్ధిక విశ్లేషకులు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు. పన్నుల రాయితీలను బడా వ్యక్తులకు ఇస్తూ పేదలకు మాత్రం న్యాయం చేయడం లేదని అంటున్నారు.

ఇక జూలై నుంచి సెప్టెంబర్ వరకూ చూస్తే ఈ ఆర్ధిక సంవత్సవం రెండవ క్వార్టర్ లో జీడీపీ గ్రోత్ రేట్ దారుణంగా పడిపోయింది. ఇది పాయిట్ ఫైవ్ పెర్సెంట్ తగ్గిపోయింది. దీని వల్ల వార్షికంగా చూస్తే జీడీపీ గ్రోత్ రేట్ కూడా 6.5 శాతమే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

కేవలం గ్రోత్ రేట్ పడిపోవడమే కాదు ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ లో కూడా రేట్ పడిపొయింది. దానికి ఉదాహరణగా హిందూస్థాన్ యూనీ లివర్, మారుతీ లాంటి కంపెనీలు ఇప్పటికే నివేదికలు చూపిస్తున్నాయి. మా వస్తువుల అమ్మకాలు తగ్గిపోయాయని కూడా ఈ సంస్థలు పేర్కొంటున్నాయి.

కేవలం లగ్జరీ ఉత్పత్తులు, హై అండ్ ప్రోడక్ట్స్ మాత్రమే అమ్ముడుపోతున్న నేపథ్యం ఉంది. కార్ల అమ్మకాలు అయినా రియల్ ఎస్టేట్ రంగం అయినా ఖరీదైన వస్తువులే అమ్ముడు పోతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో కాస్ట్లీ విల్లాస్ కే ఎక్కువ అమ్మకలౌ కనిపిస్తున్నాయి. ఈ మొత్తం చూస్తూంటే మధ్యతరగతి వర్గాలు కొనుగోలు చేసే అపార్ట్మెంట్స్ కానీ కార్లు కానీ ఇతరత్రా వస్తువుల కొనుగోలులో భారీగా మార్పులు వస్తున్నాయి.

ఇక లిస్టెడ్ కంపెనీలు సాలరీ అండ్ వేజ్ కాంపోంట్ చూస్తే కనుక వాటి గ్రోత్ రేటు కూడా సగానికి సగం పైగా పడిపోయింది అని నివేదికలు ఉన్నాయి. ఈ లిస్టెడ్ కంపెనీలు శాలరీస్ వేజెస్ మీద పెట్టే గ్రోత్ రేటు లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలీ అంటే డబుల్ డిజిట్ నుంచి సింగిల్ డిజిట్ లోకి పడిపోయిందని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

కొత్తగా జీతాల పెంపు లేదు, కొత్తగా ఉపాధి కల్పన లేదు, అలాగే ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి, ఈ మొత్తం వ్యవహారంలో పూర్తిగా ఆర్ధిక సంక్షోభంలో పడుతున్నది మధ్యతరగతి వర్గాలే అని అంటున్నారు. ముఖ్యంగా పట్టణాలలో ఉండే మధ్యతరగతి వర్గాల జీవన వ్యయం బాగా పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, వసతి కోసం పెట్టే ఖర్చు కానీ పిల్లల చదువుల విషయంలో పెట్టే ఖర్చులు కానీ దారుణంగా పెరిగిపోయాయని అంటున్నారు.

ఇక ఆరోగ్యపరమైన ఖర్చులు పెరిగాయి. హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద కూడా అడ్డగోలుగా జీఎస్టీ విధిస్తున్నారు అని అంటున్నారు. ఈ విధంగా చూస్తే కార్పోరేట్ సంస్థలు లాభాల బాటను నడుస్తున్నాయి. పేద మధ్యతరగతి అయితే దారుణంగా చితికిపోతున్నారు అని అంటున్నారు.

ఇక చిత్రంగా కార్పోరేట్ సెక్టార్ విధించే పన్నులు తగ్గుతున్నాయి. మధ్యతరగతి వర్గాల నుంచి వసూలు చేసే ఆదాయ పన్నులు భారీగా పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. దేశంలో చిత్రమైన పరిస్థితి ఈ రోజు ఉందని అంటున్నారు. కార్పోరేట్లు కట్టే పన్నుల కన్నా మధ్యతరగతి ఇండివిడ్యువల్ గా కంటే ఆదాయం పన్ను ఎక్కువగా ఉందని అంటున్నారు.

ఈ రోజున వ్యక్తిగత స్థాయిలో కట్టే ఆదాయం పన్ను గ్రోత్ రేట్ చూస్తే కార్పోరేట్ టాక్స్, జీఎస్టీ కస్టమ్ అన్నింటినీ మించి పోయింది అని ఆర్ధిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే మధ్యతరగతి వర్గాలకు మద్దెల దరువులాగానే పరిస్థితి ఉందని అంటున్నారు.

ఈ మొత్తం ఆర్ధిక వ్యవషలో కార్పొరేట్లు భారీగా లబ్ది పొందుతున్నారని అంటున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ ఆదాయం పన్నులు ఏకంగా పది శాతం తగ్గించింది అని గుర్తు చేస్తున్నారు. దీని ఫలితంగా మూడు లక్షల కోట్లు కార్పోరేట్లకు ఆదాయం సమకూరింది అని అంటున్నారు. 2014-2019ల మధ్యన కార్పోరేట్ల లాభాలు సగటున 104 శాతం పెరిగాయని గణాంకాలు తెలియచేస్తున్నాయని వివరిస్తున్నారు.

ఇక 2019 నుంచి 2024 మధ్య తీసుకుంటే కార్పోరేట్ల లాభాలు 32.5 శాతం పెరిగాయి. అంటే ఏకంగా మూడు వందల శాతం పెరిగింది అని లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో వారు కట్టే ఆదాయం పన్ను తీసుకుంటే కేవలం 18.6 శాతమే పెరిగింది అని అంటున్నారు. సాధారణంగా లాభాలు పెరిగినపుడు ఆదాయం పన్ను పెరగాలి. కానీ కార్పోరేటర్లకు ఆదాయం పన్ను భారీగా తగ్గించడం వల్లనే ఆదాయం పన్ను నుంచి వారు పెద్ద ఎత్తున మినహాయింపు పొందుతున్నారు అని అంటున్నారు. అలా మూడు లక్షల కోట్ల దాకా కార్పోరేటర్లకు పన్నుల తగ్గింపు వల్ల లాభం కలిగింది అని చెబుతున్నారు.

అంతే కాకుండా 2012-13 ఆర్ధిక సంవత్సరం నుంచి 2022 దాకా పదేళ్ళ కాలంలో చూస్తే పన్నుల రాయితీల వల్ల కార్పోరేటర్లకు ఏకంగా ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల కోట్ల ఆదాయం లాభంగా వస్తే ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఆదాయాన్ని పన్నుల రూపంలో కోల్పోయిందని అంటున్నారు. వీటికి అదనంగా కార్పోరేట్ సమస్థలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయడం వల్ల లక్షల కోట్ల ఆదాయం కూడా ప్రభుత్వం కోల్పోయింది అని అంటున్నారు.

అసలే తక్కువగానే కార్పోరేటర్లు లాభాలు చూపిస్తారు. అయినా సరే వారికే రాయితీలు ఇవ్వడం ఎందుకు అన్న చర్చ వస్తోంది. కార్పోరేట్ల వల్ల ఉపాధి దక్కుతుందని, ఆర్ధిక వృద్ధి లభిస్తుందని ప్రభుత్వాలు చెబుతూంటాయి. అందుకే రాయితీలు ఇస్తామని అంటున్నారు. కానీ గడచిన పదేళ్ళ కాలంలో చూస్తూంటే ఉపాధి ఏదీ పెరగలేదు ఆర్ధిక వృద్ధి కూడా జరగలేదు, ఎగుమతులు కూడా ఆశించిన స్థాయిలో పెరరలేదు అని గుర్తు చేస్తున్నారు

దాని మీద కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏకంగా ప్రైవేట్ కంపెనీలతో మీటింగులు పెట్టి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు అని కూడా చెబుతున్నారు. కానీ కేంద్ర ఆర్ధిక మంత్రితో పాటు పాలకులకు అర్ధం కాని విషయం ఏంటి అంటే ఉత్పత్తికి ప్రోత్సాహం ఇస్తే జరగదు కొనేవారు ఉంటేనే ఉత్పత్తి చేస్తారు. ఇది ఆర్ధిక మూల సూత్రమని అంటున్నారు. సప్లై సైడ్ ఇచ్చే రాయితీలతోనే ఆర్ధిక వృద్ధి సాధ్యపడదు, కానీ డిమాండ్ సైడ్ ప్రోత్సాహంతోనే వృద్ధి పెరుగుతుంది. అంటే ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలను పాలకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.

కంప్త్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ఆరు నెలలకు గానూ టాక్స్ కలెక్షన్ డేటాను ఇటీవల రిలీజ్ చేసింది. అందులో 2023 ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే 2024లో ప్రిల్ నుంచి సెప్టెంబర్ ఆరు నెలలకు గానూ 12 శాతం ఆదాయం పన్ను వసూళ్ళు పెరిగింది. ఇందులో కార్పోరేట్ సంస్థలు కట్టే పన్నుల రేటు 2.3 శాతం ఉందని అంటున్నారు. అదే సమయంలో పర్సనల్ ఇంకం టాక్స్ 25 శాతం పెరిగింది. వేతన జీవులు జీతగాళ్ళు మధ్యతరగతి పేద వర్గాల నుంచి పెద్ద ఎత్తున పన్నులను ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు.

జీఎస్టీ కూడా ఎక్కువగా పేదవారు కడుతున్నారు. ఇది కూడా సామాన్యుడి మీద పెను భారంగా ఉంది. జీఎస్టీ భారం మధ్యతరగతి వారే మోస్తున్నారు. మధ్యతరగతిని దారుణంగా భారాలు మోపి ప్రభుత్వాలు ఇబ్బందులో పెడుతున్నాయని అంటున్నారు. ఈ విధానం మారాల్సి ఉందని అంటున్నారు.