ఆ విషయంలోనూ పవన్ సిగ్గు పడుతున్నారా.. ?
అంటే.. చంద్రబాబు అందుబాటులో లేకపోతే.. ఎవరైనా.. ఆ నెస్ట్.. కలవాల్సింది ఉప ముఖ్యమంత్రినే.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారు. సహజంగా ప్రభుత్వ పరంగా చూస్తే.. సీఎం తర్వాత ప్లేస్ డిప్యూటీ సీఎందే. రాజ్యాంగం పరంగా ఎలాంటి ప్రాధాన్యం ఉన్నా లేకున్నా.. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఒక వ్యవస్థ ప్రకారం.. సీఎం తర్వాత ప్లేస్ డిప్యూటీ సీఎందే. అంటే.. చంద్రబాబు అందుబాటులో లేకపోతే.. ఎవరైనా.. ఆ నెస్ట్.. కలవాల్సింది ఉప ముఖ్యమంత్రినే.
ఇది.. ఒక ప్రొటోకాల్. అయితే.. ఈ విషయంలోనూ పవన్ సిగ్గు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. చంద్రబా బు తర్వాత స్థానంలో(ప్రొటోకాల్ ప్రకారం) వ్యవహారాలు చక్కబెట్టాల్సిన పవన్.. మౌనంగా ఉంటున్నారు. ఎక్కడా ఎవరితోనూ టచ్‌లోకి రావడంలేదు. అసలు తన పని తాను చేసుకుని పోతున్నారేతప్ప.. చంద్రబాబు తర్వాత.. విధిగా తాను చేయాల్సిన పనుల విషయాన్ని ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు తర్వాత.. సర్కారు పరంగా నారా లోకేష్ చక్కబెడుతున్నారు.
ఇటీవల విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. కోట్ల రూపాయల మొత్తాలను దాతలు అందిస్తున్నారు. ఇలా వచ్చే వారిలో పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛం సంస్థల అధినేతలు, వివిధ ఉద్యోగ సంఘాలు.. కార్మిక సంఘాల వారు కూడా ఉన్నారు. అయితే.. ఎవరైనా సరే.. ఎంత మొత్తమైనా సరే.. నేరుగా సీఎంకు అందించి.. ఆయనతో ఒక ఫొటో వేసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. సాధ్యమైనంత వరకు చంద్రబాబు అందుబాటులోనే ఉన్నారు.
అయితే.. ఎప్పుడైనా చంద్రబాబు అందుబాటులో లేకపోతే.. డిప్యూటీ సీఎం ఈ పాత్రనుపోషించాలి. ఆయనకు దాతలు విరాళాలు ఇవ్వాలి. కానీ.. ఇక్కడే పవన్ వెనుకడుగు వేస్తున్నారు. తాను అందుబాటులోనే ఉన్నా.. ఎవరికీ అందుబాటులోకి రావడం లేదు. దీంతో నారా లోకేష్ రంగంలోకి దిగుతున్నారు. దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. వారితో ఫొటోలు కూడా దిగుతున్నారు. ఇలాంటి వారిలో మెగా ఫ్యామిలీ హీరో.. సాయి ధరమ్ తేజ్ కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మరి.. పవన్ ఎందుకు ప్రొటోకాల్‌ను కూడా పక్కన పెడుతున్నారనేది చర్చ.