ప‌థ‌కాలు ఆల‌స్యం కామ‌నే.. ఈ రాష్ట్రాల్లో ఏం జ‌రిగిందంటే..!

దీంతో కూట‌మి ప్ర‌భుత్వంలోని ఇత‌ర రెండు పార్టీల సంగ‌తి ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది.

Update: 2025-01-29 22:30 GMT

ఏపీలో గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కుముందు టీడీపీ ఇచ్చిన సూప‌ర్ సిక్స్ హామీల వ్య‌వ‌హారం హాట్ హాట్‌గా మారింది. ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేద‌ని.. ప‌థ‌కాల‌ను అస‌లు అమ‌లు చేసే ఉద్దేశం కూడా లేద‌ని.. ఈ విష‌యాన్ని తాము ముందే చెప్పామ‌ని.. అయినా.. ప్ర‌జ‌లు న‌మ్మి ఓట్లు వేసి మోస‌పోయార‌ని పెద్ద ఎత్తున వైసీపీ నేత‌లు ప్ర‌చారం చేస్తున్నారు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వంలోని ఇత‌ర రెండు పార్టీల సంగ‌తి ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంది.

ఈ నేప‌థ్యంలో అస‌లు ఇత‌ర రాష్ట్రాల్లో ప‌థ‌కాల అమ‌లు ఏ తీరుగా ఉందో చూస్తే.. కూట‌మి స‌ర్కారుకు, ముఖ్యంగా టీడీపీకి ఇత‌ర రాష్ట్రాల‌కు ఉన్న తేడా అర్థం అవుతుంది. క‌ర్ణాట‌క‌లో ఎప్పుడో ఏర్ప‌డిన కాంగ్రెస్ పార్టీ 5 గ్యారెంటీల‌ను ఇచ్చింది. దీని మేర‌కే అక్క‌డ కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చింది. వ‌చ్చీ రాగానే అమ‌లు చేసిన ఏకైక ప‌థ‌కం ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళ‌ల కు ఉచిత ప్ర‌యాణం. ఆ త‌ర్వాత‌.. ఇత‌ర గ్యారెంటీల జోలికి పెద్ద‌గా పోలేదు. ఒక‌టి రెండు అమ‌లు చేస్తామ‌ని చెబుతున్నా.. ఏడాదిన్న‌ర త‌ర్వాత కూడా ఆ ఊసు లేకుండా పోయింది.

పైగా బెంగ‌ళూరు వంటి ఆర్థిక రాజ‌ధాని క‌ర్ణాట‌క‌కు ఉన్నా.. ప‌థ‌కాల అమ‌లులో వెనుక‌బ‌డింది. ఇక‌, నెల నెల రూ.2000 చొప్పున మ‌హిళ‌ల‌కు ఇస్తున్నా.. అనేక కొర్రీలు పెడుతున్నారు. కానీ, ఏపీలో పింఛ‌న్ల‌ను రూ.1000కి పెంచి అమ‌లు చేస్తున్నారు. ఇక‌, తెలంగాణ విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ‌కూడా ఉచిత బ‌స్సును మాత్ర‌మే అమ‌లు చేస్తున్నారు. నిరుద్యోగుల‌కు ఇస్తామ‌న్న భృతివిష‌యంపై కాంగ్రెస్ పార్టీ నోరు విప్ప‌డం లేదు. రైతు రుణ మాఫీ హామీ కూడా.. అంతంత మాత్రంగానే ఉంది. చిత్రం ఏంటంటే.. ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది అవుతోంది.

ఇక‌, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్ప‌డి ఐదేళ్లు అయింది. వ‌చ్చే నెల 5న మ‌ళ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. కానీ, ఇప్ప‌టికీ గ‌త ఐదేళ్ల కింద‌ట ఇచ్చిన ఉచిత హామీల్లో కీల‌క‌మైన పేద‌ల‌కు సొంత ఇల్లు ప‌థ‌కాన్ని ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేయ‌లేదు. త‌మిళ‌నాడు విష‌యంలోనూ ఇలానే జ‌రిగింది. ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన 12 హామీల్లో ఇప్ప‌టివ‌ర‌కు స్టాలిన్ ప్ర‌భుత్వం 7 మాత్ర‌మే అమ‌లు చేసింది. ప్ర‌భుత్వం ఏర్ప‌డి 2ఏళ్లు అవుతోంది. సో.. ఏపీలో మాత్ర‌మే ప‌థ‌కాలు ఆల‌స్యం అవుతున్నాయ‌న్న‌ది కేవ‌లం రాజ‌కీయ ప్ర‌చారమేత‌ప్ప‌.. నిజం కాద‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

Tags:    

Similar News