సోషల్ మీడియా కేసుల వేళ... నేతలకు ఓ సూపర్ అప్షన్!
అయితే... ఈ కేసుల వేళ కార్యకర్తల సంగతి కాసేపు పక్కనపెడితే.. అటు వైసీపీ, ఇటు కూటమి నేతలు ఓ ఆసక్తికర ఆప్షన్ ఎంచుకుంటున్నారని అంటున్నారు.
సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, అభ్యంతరకర కామెంట్లు, అసహ్యకరమైన ఫోటోలు పోస్ట్ చేసి, షేర్ చేసినవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ కేసుల వేళ కార్యకర్తల సంగతి కాసేపు పక్కనపెడితే.. అటు వైసీపీ, ఇటు కూటమి నేతలు ఓ ఆసక్తికర ఆప్షన్ ఎంచుకుంటున్నారని అంటున్నారు.
అవును... ఇప్పుడు ఏపీలో ఒకటే హాట్ టాపిక్ గా ఉంది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిన వారి లక్ష్యంగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ సమయంలో... అటు అధికార పార్టీ నేతలు, ఇటు విపక్ష పార్టీ నేతలు సైతం విచారణలో కొంతమంది.. మీడియా ముందు మరికొంతమంది.. "నకిలీ" టాపిక్ ఎత్తుతున్నారని అంటున్నారు.
ఇందులో భాగంగా... తమను ఇరికించడానికి ప్రత్యర్థులు తమ పేర్లతో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేశారని.. వాటి ద్వారా తప్పుడు పోస్టులు పెడుతున్నారని.. ఇదంతా తమను ఇరికించడానికి జరుగుతున్న ప్రయత్నాలని చెబుతున్నారు. అయితే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తుంది వైసీపీ నేతలు మాత్రమే కాదు.. అటు కూటమి నేతలూ ఇదే పాట పాడుతున్నారని అంటున్నారు.
ఉదాహరణకు తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ... తమ పార్టీ కార్యకర్తల పేర్ల మీద టీడీపీకి చెందిన వారు నకిలీ ఖాతాలు తెరిచారని.. అందులో కూటమి పార్టీలకు చెందిన నేతలు, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులుపెడుతూ తమను ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. టీడీపీ నేతలు ఇదే చెబుతున్నారు.
ఇందులో భాగంగా... ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేత మహాసేన రాజేష్, అతని అనుచరులమీద తాజాగా కేసు నమోదైంది. ఈ సమయంలో... తనపై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ శాంతి అనే వివాహిత ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో.. తన పేరిట ఎవరో నకిలీ అకౌంట్స్ ఓపెన్ చేశారని మహాసేన రాజేష్ చెబుతున్నారు.
ఇలా ఇప్పుడు అధికార పార్టీ నేతలు, ఇటు విపక్ష సభ్యులు కూడా ఇప్పుడు నకిలీ అనే అంశాన్ని తెరపైకి తేవడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో... నేతలు చెబుతున్నట్లు నిజంగా ఈ నకిలీలు నకిలీలేనా.. లేదా, కేసుల గురించి తప్పించుకోవడానికి ఈ ఆప్షన్ ని ఎంచుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.
అది తెలియాలంటే, తేలాలంటే... పోలీసులు ఉన్నంతంలో నిజాయతీగా, వీలైనంత లోతుగా పరిశోధన సాగిస్తే కచ్చితంగా వాస్తవాలు నిగ్గూ తేలుతాయని అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎలా కొలిక్కి వస్తుందనేది వేచి చూడాలి!