రఘురామ సహనానికి తొలి పరీక్ష
అయితే ఈ సందర్భంగా కూటమి తరఫున ఉన్న మూడు పార్టీలకు రఘురామ మాట్లాడేందుకు అవకాశాలు ఇచ్చారు.
సభాపతి అవుదామని భావించి ఉప సభాపతి పదవిని ఎట్టకేలకు అందుకున్న రఘురామ క్రిష్ణం రాజుకు శుక్రవారం ఒక రోజంతా స్పీకర్ చెయిర్ దక్కింది. ఆయనే మొత్తం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ని నడిపించారు. బడ్జెట్ మీద చర్చను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రారంభించారు. అనేక మంత్రి ఎమ్మెల్యేలు మాట్లాడారు, బడ్జెట్ మీద చర్చకు ముఖ్యమంత్రి చంద్రబాబు జవాబు చెప్పడంతో బడ్జెట్ ని ఆమోదించింది సభ.
అయితే ఈ సందర్భంగా కూటమి తరఫున ఉన్న మూడు పార్టీలకు రఘురామ మాట్లాడేందుకు అవకాశాలు ఇచ్చారు. అయితే టీడీపీకి చెందిన సీనియర్ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడినపుడు మాత్రం రఘురామకు నిజంగా ఒక పరీక్షగానే అనిపించింది అని అంటున్నారు.
జ్యోతుల నెహ్రూ బడ్జెట్ మీద ప్రసంగం చేశారు. ఆయన తనను మాట్లాడనివ్వడం లేదంటూనే ఏకంగా ఇరవై అయిదు నిమిషాల దాకా మాట్లాడారు. అయితే ఆయన తన కంటే జూనియర్లకు ఎక్కువ సమయం ఇచ్చారని తనకు కూడా అవసరమైనంత వరకూ సమయం ఇవ్వాలని స్పీకర్ ని కోరుతూ వచ్చారు.
అయితే నెహ్రూ తరువాత మరో ముగ్గురు ఎమ్మెల్యేకు చాన్స్ ఇచ్చి ఆనక ఆర్ధిక మంత్రి పయ్యావుల స్పీచ్ అనంతరం ముఖ్యమంత్రి సమాధానంతో బడ్జెట్ ని ఆమోదించాలని రఘురామ భావించారు. మరో వైపు చూస్తే చంద్రబాబు బడ్జెట్ స్పీచ్ తరువాత ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది.
దాంతో సమయం మధ్యాహ్నం తరువాత తక్కువగా ఉంది. దాంతో జ్యోతున నెహ్రూ స్పీచ్ ని తొందరగా ముగించమని పలు మార్లు స్పీకర్ తన టేబిల్ వద్ద నుంచి బెల్ కొడుతూ సంకేతాలు ఇచ్చారు. అలా ఇచ్చిన ప్రతీసారి జ్యోతుల నెహ్రూ అయితే తనకు ఎక్కువగా మాట్లాడేందుకు ఇవ్వాలని కోరుతూ అసహనం వ్యక్తం చేశారు.
తనను ప్రతిపక్షంలోని సభ్యుడిగా చూస్తారా అని కూడా ఒక దశలో అన్నారు. అయితే ఆయన అలా అనడంతో రఘురామ ఆయనకు సమయం గుర్తు చేస్తూనే మరింత చాన్స్ ఇస్తూ వెళ్లారు. అయితే మొత్తం బడ్జెట్ లోని అన్ని అంశలా మీద తనదైన అభిప్రాయాలను జ్యోతుల నెహ్రూ చెబుతూ వెళ్లారు. ఇసుక విధానం ప్రభుత్వానిది బాగా లేదని కూడా ఇండైరెక్ట్ గా విమర్శించారు.
ఇలా ఆయన ప్రసంగం కొనసాగుతుండగా రఘురామ ఆయన మైక్ బలవంగంగా కట్ చేశారు ఇంకా చాలా మంది మాట్లాడేందుకు ఉన్నారని చెబుతున్నాను కదా అని రఘురామ అసహనం వ్య్కతం చేశారు. నిజానికి రఘురామ చాలా కూల్ గానే తొలిసారి సభను హ్యాండిల్ చేశారు.
అయితే సీఎం ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్లాల్సి ఉందని ఆయన అంటూ సభ్యులకు ఆ విషయం చెప్పారు. అయితే సభలో మరింత సమయం పొడిగిస్తే బాగుంటుంది కదా అని జ్యోతుల నెహ్రూ కోరినా సమయాభావమని స్పీకర్ చెప్పారు.
ఇవన్నీ పక్కన పెడితే స్పీకర్ చెయిర్ లో తొలి రోజే రఘురామకు ఈ విధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యే ద్వారా పరీక్ష ఎదురైంది అని అంటున్నారు. ఆయన ఎంత కూల్ గా డీల్ చేద్దామన్నా కుదరకపోయేసరికి కాస్తా ఆవేశాన్ని చూపించాల్సి వచ్చిందని అంటున్నారు.