జగన్ తరహా 'ర్యాంప్' హీరో గారు వేస్తున్నారా?
ఒకసారి ముందుకు వెళ్లిన తర్వాత మళ్లీ వెనుకు తిరగకుండా అదే మార్గంలో వెనుక వైపు నడుచుకుని వచ్చేవారు.
ఏపీ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా వైకాపా 'సిద్దం' పేరిట భారీ సభలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ర్యాంప్ లు కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వేలాది మంది పార్టీ కార్యకర్తల్ని, అభిమానుల్ని ఉద్దేశించి అందరికీ దగ్గరగా వెళ్లాలని అనే కాన్సెప్ట్ తో మూడు వైపాలు ర్యాంప్ లు ఏర్పాటు చేసి ప్రచారం చేసారు. వేదికపైకి వెళ్లగానే జగన్ ఆర్యాంప్ లన్నీ చుట్టేసే వారు. ఒకసారి ముందుకు వెళ్లిన తర్వాత మళ్లీ వెనుకు తిరగకుండా అదే మార్గంలో వెనుక వైపు నడుచుకుని వచ్చేవారు.
ఇలా వాక్ చేయడం ఆయనకు ఓ సెంటిమెంట్ గా హైలైట్ అయింది. అంతవరకూ ఏ పార్టీ ఇలా ర్యాంప్ లు వేసి ప్రచారం చేయలేదు. తొలిసారి వైకాపానే ఇలా వినూత్నంగా ప్లాన్ చేసి ప్రచారంలో గ్రాండ్ సక్సెస్ అయింది. తాజాగా ఇదే తరహాలో ప్రచారానికి తలపతి విజయ్ కూడా రంగం సిద్దం చేస్తున్నారు. `నోటి మాటలతో కాదు..చేతల్లో చూపించడం మన భాష అని పార్టీ కేడర్ కు తమిళగ వెట్రీ కళగం అధ్యక్షుడు విజయ్ పిలుపునిచ్చారు.
పార్టీ అజెండా ఏంటో ప్రజలకు చెప్పేందుకు ఈనెల 27న విల్లుపురం జిల్లా విక్రవాండిలో సభా వేదికగా మారనుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మహానాడు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. అభిమానులను, కేడర్ ను విజయ్ పలక రించేందుకు వీలుగా 800 మీటర్ల వరకూ ప్రత్యేక ర్యాంప్ ను ఏర్పాటు చేస్తున్నారు. సెయింట్ జార్జ్ కోటను తలపించే విధంగా మహానాడు వేదిక రూప కల్పన జరుగుతోంది. ఇప్పటికే విజయ్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.
దీంతో భారీ ఎత్తున అభిమానులు సభకు తరలి రావడం ఖాయం. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటలను చోటు చేసుకోకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సభకు వృద్దులు, పిల్లలు, గర్బిణీలు, బాల బాలికలు మహానాడుకు రావొద్దని సూచిస్తూ కేడర్ కు లేఖ రాసారు. అలాంటి వారంతా టీవీ ఛానళ్ల ద్వారా సభను వీక్షించాలని విజయ్ కోరారు.