బీజేపీలోకి విజయసాయిరెడ్డి...ముహూర్తం ఫిక్స్ ?

అంతే కాదు వైఎస్సార్ కుటుంబంతో మూడు తరాల బంధం ఉంది.;

Update: 2025-03-05 18:30 GMT

వైసీపీలో నంబర్ టూ గా వ్యవహరిస్తూ పార్టీ పునాదుల నుంచి పనిచేసిన విజయసాయిరెడ్డి అంటే కేరాఫ్ వైసీపీ అనే ఎవరైనా అంటారు. అంతలా అనుబంధం పార్టీతో ఉంది. అంతే కాదు వైఎస్సార్ కుటుంబంతో మూడు తరాల బంధం ఉంది.

వైసీపీకి ఆయన ఒక పిల్లర్ గా నిలబడ్డారు. అటువంటి పెద్దాయన వైసీపీని వీడిపోతారు అని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. వైసీపీలో విజయసాయిరెడ్డి స్థానం శాశ్వతం అనుకున్నారు. ఆయనకు అదే పార్టీ తప్ప మరేదీ కాదు ఆయనకు ఆపషన్ అన్నది ఎప్పటికీ తట్టను కూడా తట్టదు అనుకున్నారు.

కానీ ఇది రాజకీయం. అనుకున్నవి జరగవు. అనుకోనివి జరుగుతాయి. అందుకే విజయసాయిరెడ్డి 2025 కొత్త ఏడాది వస్తూనే వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేశారు. ఆయన జనవరి నాలుగవ వారంలో వైసీపీకి రాజీనామా చేశారు. అంతే కాదు రాజకీయాలకే దూరం అన్నారు. వ్యవసాయం చూసుకుంటాను అన్నారు. ఇక ఇదే తన జీవితంలో అసలైన లక్ష్యమని అన్నారు.

కట్ చేస్తే ఆయన తాజాగా ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ హైదరాబాద్ వచ్చిన వేళ ఆయనకు స్వాగతం పలుకుతూ కనిపించారు. దాంతో ఆయన రాజకీయం వీడాలనుకున్నా వీడేది కాదని విశ్లేషకులు భావిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలో మరో వార్త జోరుగా ప్రచారంలోకి వస్తోంది. విజయసాయిరెడ్డి బీజేపీలో చేరిపోతారు అని. ఆ పార్టీతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన 2016లో రాజ్యసభకు తొలిసారి నెగ్గారు. నాటి నుంచి కేంద్ర పెద్దలతో ఆయనకు గుడ్ రిలేషన్స్ ఉన్నాయి.

ఎంతలా అంటే ఒక దేశ ప్రధాని ఆయన పేరుని గుర్తుంచుకుని మరీ పిలిచేటంతగా. అంతే కాదు అత్యంత శక్తివంతమైన నేతగా గుర్తింపు ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయితే ఆయనకు అపాయింట్మెంట్లు కోరిన వెంటనే ఇచ్చేంత పలుకుబడి ఉందని.

ఇలా ఢిల్లీ సర్కిల్స్ లో రకరకాలుగా ప్రచారం అయితే ఉంది. నిజానికి విజయసాయిరెడ్డికి బీజేపీ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆయన తాను రాజ్యసభ నుంచి తప్పుకుంటున్నపుడు ప్రత్యేకించి మోడీ అమిత్ షాలకు స్పెషల్ థాంక్స్ చెప్పారు.

ఈ క్రమంలో లేటెస్ట్ గా జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే బీజేపీలోకి విజయసాయిరెడ్డి వెళ్తారని అంటున్నారు. దానికి ఒక డేట్ టైం ముహూర్తం కూడా నిర్ణయించారు అని అంటున్నారు. ఈ ఏడాది జూన్ నెలలో ఆయన కాషాయ తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు.

నిజానికి బీజేపీ పెద్దలతో ఈ రోజుకీ ఆయన రిలేషన్స్ కొనసాగిస్తున్నారు అని అంటున్నారు. విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి బయటకు రాగానే బీజేపీలో చేర్చుకునేందుకు ఆయనకు ఆహ్వానం అందింది అని అంటున్నారు. అయితే వెంటనే చేరితే వైసీపీని జగన్ ని వెన్నుపోటు పొడిచి వచ్చారు అన్న అపప్రధ తన మీదకు వస్తుందన్న ఆలోచనతోనే విజయసాయిరెడ్డి పొలిటికల్ రిటైర్మెంట్ అన్న ప్రకటన ఇచ్చారని అంటున్నారు.

అందువల్ల కొన్ని నెలలు ఆగి చేరాలన్నది కూడా అప్పట్లోనే తీసుకున్న డెసిషన్ అని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి బీజేపీలో చేరుతారు అన్నది టీడీపీ కూటమి పెద్దలకు కూడా ఒక ఐడియా ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే విజయసాయిరెడ్డి కనుక బీజేపీలో చేరితే జగన్ కి సరికొత్త రాజకీయ సవాల్ ఎదురవడం ఖాయమని అంటున్నారు. ఇక ఏపీ పాలిటిక్స్ లోనూ భారీ మార్పులు చోటు చేసుకుంటాయని కూడా చెబుతున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత అన్నది కొద్ది నెలలు ఆగితేనే తెలుస్తుంది అని అంటున్నారు.

Tags:    

Similar News