గ్యాప్ ఇవ్వడం లేదు... ఇజ్రాయెల్ మరో బిగ్ బ్రేక్ త్రూ!

ఇందులో భాగంగా... సుమారు మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ హసీమ్ సఫీద్దీన్ మృతి చెందాడని తెలిపింది.

Update: 2024-10-23 04:40 GMT

హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. నస్రల్లాను అంతమొందించడం తమ యుద్ధ లక్ష్యాలను సాధించడంలో అతి ముఖ్యమైన విషయం అని తెలిపారు. ఈ నేపథ్యంలో హిజ్బొల్లా కు మరో భారీ దెబ్బ తగిలింది.

అవును... హిజ్బొల్లాను ఇజ్రాయెల్ సైన్యం తేరుకోనివ్వడం లేదు! దెబ్బ మీద దెబ్బ కొడుతూ ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది! ఇప్పటికే హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లాను అంతమొందించిన ఐడీఎఫ్.. తాజాగా అతని బంధువు హసీమ్ సఫీద్దీన్ ను అంతమొంచిందని తెలుస్తోంది. హిజ్బొల్లాకు ఇతడే నస్రల్లా వారసుడనే కామెంట్లూ వినిపించాయి.

ఈ సమయంలో ఇతడు మృతి చెంది ఉండోచ్చని ఇంటర్నేషనల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ తరహా వార్తలు మూడు వారాల క్రితమే వచ్చినా.. ఐడీఎఫ్ కానీ, హెజ్బొల్లా కానీ ధృవీకరించలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇందులో భాగంగా... సుమారు మూడు వారాల క్రితం జరిగిన దాడిలో హెజ్బొల్లా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ హసీమ్ సఫీద్దీన్ మృతి చెందాడని తెలిపింది. ఇతడితో పాటు హెజ్బొల్లా ఇంటెలిజెన్స్ హెడ్ క్వార్టర్స్ కమాండర్ అలీ హుస్సేన్ హజీమా మృతి చెందినట్లు ధృవీకరించామని ఐడీఎఫ్ ప్రకటనలో పేర్కొంది.

కాగా... లెబనాన్ లోని దాహియాలో ఓ బంకర్ లో హసీమ్ సమావేశం నిర్వహించారనే పక్కా సమాచారంతో ఐడీఎఫ్ దాడులు చేసినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో హుస్సేన్ అలీ హజీమా, సఫిద్దీన్ మృతి చెందినట్లు వార్తలు అప్పుడే వచ్చినా.. ఐడీఎఫ్ ధృవీకరించలేదు. అయితే... తాజాగా ఆ విషయాన్ని ధృవీకరించింది. హసీమ్ ను అమెరికా 2017లో ఉగ్రవాదిగా ప్రకటించింది.

Tags:    

Similar News