నస్రుల్లాను మట్టుపెట్టిన స్క్వాడ్రన్.. ముద్దుగా హామర్స్ ఎవరు?

లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్ బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా మృతి చెందిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-29 08:30 GMT

లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హెజ్ బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పందించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు... నస్రల్లాను హతమార్చడంతో ఇజ్రాయెల్ లెక్క సరిచేసిందని తెలిపారు. ఈ సమయంలో... నస్రల్లాను హతమార్చడంలో కీలక భూమిక పోషించిన ఓ స్క్వాడ్రన్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... హెజ్ బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి చెందడాన్ని ఇజ్రాయెల్ కు చారిత్రాత్మక మలుపుగా ఆ దేశ ప్రధాని అభివర్ణించిన వేళ... ఈ "ఆపరేషన్ న్యూ ఆర్డర్" పేరిట హెజ్ బొల్లా ప్రధాన కార్యాలయంపై చేసిన దాడిలో కీలక భూమిక పోషించిన స్క్వాడ్రన్ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ స్క్వాడ్రన్ ను ముద్దుగా హామర్స్ అని కూడా పిలుస్తారు.

వాస్తవానికి గతంలో ఇజ్రాయెల్ ప్రధాని న్యాయ సంస్కరణలు వ్యతిరేకిస్తూ వాయుసేన లోని ఓ స్క్వాడ్రన్ ఆందోళనకు దిగింది. అయితే... గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ జరిపిన దాడితో తిరిగి విధుల్లోకి చేరింది. ఇప్పుడు తాజాగా అదే స్క్వాడ్రన్ ఏకంగా హెజ్ బొల్లా అధినేతను లెబనాన్ లోనే మట్టుబెట్టింది. ఇదే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 69వ స్క్వాడ్రన్!

గతంలో సిరియా, లెబనాన్ లో జరిపిన కఠినమైన ఆపరేషన్స్ లో అనుభవం ఉన్న సిబ్బంది కలిగి ఉన్న ఈ స్క్వాడ్రన్.. హెజ్ బొల్లా కార్యాలయంపై చేసిన దాడిలో ఎఫ్-15ఐ రాం ఫైటర్ జెట్స్ ను వాడినట్లు చెబుతున్నారు. ఈ దాడికి సుమారు 100 బాంబులను ప్రతీ రెండు సెకన్లకు ఒకటి చొప్పున లక్ష్యంపై జారవిడిచినట్లు వెల్లడించారు ఈ ఎయిర్ బేస్ కొత్త కమాండింగ్ ఆఫీసర్ అమిచయ్ లెవినె.

ఈ ఆపరేషన్ న్యూ ఆర్డర్ లో భాగంగా నస్రల్లా కదలికలపై గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ కు కచ్చితమైన సమాచారం అందుతున్నప్పటికీ... ఈ దాడికి నెతన్యహు మంత్రి వర్గంలోని కొంతమంది వ్యతిరేకిస్తున్నట్లు యూఎస్ మీడియా పేర్కొంది! అయితే అతడు ఒకసారి మిస్ అయితే.. అతడికి సంబంధించిన సమాచారం సేకరించడం చాలా కష్టమని ప్రధాని భావించినట్లు చెబుతున్నారు.

దీంతో... ఈ ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈ సమయంలో ఈ ఆపరేషన్ కు సంబందించిన ఇజ్రాయెల్ సైన్యం కొన్ని వీడియోలను విడుదల చేసింది! వాటిలో కొన్ని యుద్ధ విమానాల్లో అమెరికా తయారు చేసిన బీ.ఎల్.యూ.-109 బాంబులను వాడినట్లు న్యూయార్ టైంస్ కథనం ప్రచురించింది. మే నెలలో వీటిని ఇజ్రాయేల్ కు అమెరికా పంపినట్లు పేర్కొంది.

Tags:    

Similar News