'ప్రతీ పురుషుడు మూడేళ్లు సైన్యంలో పనిచేయాల్సిందే'!

వాస్తవానికి ఇప్పటికే ప్రతి పురుషుడూ 34 నెలలపాటు తప్పనిసరిగా మిలటరీలో పనిచేయాలన్న నిబంధన ఉంది

Update: 2024-07-13 11:30 GMT

"ఈ దేశంలోని ప్రతీ పురుషుడు తప్పనిసరిగా మూడేళ్లు సైన్యంలో పనిచేయాల్సిందే" అనే కీలక ప్రతిపాదనను ఇజ్రాయేల్ తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. గాజాలో హమాస్ తో అవిరామంగా అన్నట్లుగా యుద్ధం సాగుతున్న వేళ ఇజ్రాయేల్ ఈ కీలక ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఇప్పటికే ప్రతి పురుషుడూ 34 నెలలపాటు తప్పనిసరిగా మిలటరీలో పనిచేయాలన్న నిబంధన ఉంది.

అవును... ప్రతిపురుషుడు 34 నెలల పాటు తప్పనిసరిగా మిలటరీలో పనిచేయాలన్న నిబంధన ఉండగా.. దీన్ని తాజాగా మూడేల్లకు పెంచనున్నట్లు కథనాలొస్తున్నయి. ఈ మేరకు ఇజ్రాయేల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశానికి చెందిన "వైనెట్" వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఈ తాజా నిబంధనలు మరో ఎనిమిదేళ్లపాటు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.

గత కొంతకాలంగా ఇజ్రాయేల్ యుద్ధాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఓ వైపు హమాస్ ఉగ్రవాదులతోనూ.. మరోవైపు లెబనాన్ కేంద్రంగా పనిచేస్తున్న మరో బ్యాచ్ హెబోబొల్లాతోనూ ఒకేసారి యుద్ధం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయేల్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ముష్కర మూకలకూ ఇరాన్ పూర్తి మద్దతు ఉండటంతో... వాటిని ఎదుర్కొనేందుకు ఈ ఆలోచన తప్పడం లేదని అంటున్నారు.

ఇరాన్ మద్దతు అటు హమాస్ కు, ఇటు హెబోబొల్లాకు ఉండటంతో... ఒకేసారి వారందరినీ ఎదుర్కొనేందుకు సైనిక సంపత్తిని కచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం అనివార్యమని ఇజ్రాయేల్ మిలటరీ కమాండర్లు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ దిశగా చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. దీనిపై ఆదివారం జరగబోయే పూర్తిస్థాయి కేబినెట్ లో ఓటింగ్ పెట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News