ఇస్రో మరో ఘనత... చైనా, రష్యా, అమెరికా తర్వాత భారత్!

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది.

Update: 2025-01-16 07:58 GMT

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ఘనత సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభంలోనే సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. ఇందులో భాగంగా... స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా పూర్తైనట్లు తెలిపింది. ఫలితంగా... ప్రపంచంలో ఇప్పటివరకూ ఈ ఘనత సాధించిన చైనా, రష్యా, అమెరికా తర్వాత నాలుగో దేశంగా నిలిచింది. దీనిపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు.

అవును... భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ఘనత సృష్టించింది. ఇందులో భాగంగా.. ఇటీవల అంతరిక్షంలోకి పంపించిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా అనుసంధానం చేసింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా వెల్లడిస్తూ... స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా పూర్తైనట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా సాంకేతిక బృందానికి, భారతీయులకు అభినందనలు తెలిపింది.

గత ఏడాది డిసెంబర్ 30న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60లో రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది ఇస్రో. ఈ సందర్భంగా ఈ పీ.ఎస్.ఎల్.వీ. బయలుదేరిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్ 1-బి... 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఏ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వీటిని డాకింగ్ కోసం మూడుసార్లు ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో పలుమార్లు ఈ ప్రక్రియ వాయిదాపడుతూ వచ్చింది. అయితే... ఫైనల్ గా నేడు వీటి అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా వీటి మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకొచ్చారు. అక్కడ ఈ రెండు ఉపగ్రహాలను హోల్డ్ చేసి డాకింగ్ ను మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియ సక్సెస్ అయినట్లు తాజాగా ఇస్రో ఎక్స్ వేదికగా ప్రకటించింది.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇందులో భాగంగా... అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను సక్సెస్ ఫుల్ గా అనుసంధానం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు, టెక్నికల్ టీమ్ కు మోడీ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో దేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రయోగాలను ఇది కీలక మెట్టుగా నిలిచిందని అన్నారు.

Tags:    

Similar News