బుట్టా సర్దుకుంటున్నారా? మళ్లీ టీడీపీలోకి వస్తారా?
దీంతో రేణుక మరోసారి టీడీపీ గూటికి చేరడం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అధికారంలో ఉండే పార్టీలోకి జంప్ అవడం అలవాటుగా మార్చుకున్న మాజీ ఎంపీ బుట్టా రేణుక మరోసారి బుట్ట సర్దుతున్నారా? టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఓ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో బుట్టా రేణుక చర్చలు జరిపారనే ప్రచారమే అందుకు కారణం. మంత్రి ఆనంతో కలిసి బుట్టా రేణుక మట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రేణుక మరోసారి టీడీపీ గూటికి చేరడం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014లో వైసీపీ తరపున బుట్టా రేణుక కర్నూలు ఎంపీగా గెలిచారు. కానీ అప్పుడు టీడీపీ ఏపీలో అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరిపోయారు. కానీ 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆ ఎన్నికల్లో జగన్ ఆమెకు పోటీ చేసే అవకాశం కల్పించలేదు. అయినా సైలెంట్‌గానే ఉన్న బుట్టా అదే పార్టీలో కొనసాగారు. ఈ సారి ఎన్నికల్లో ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానం నుంచి బుట్టా పోటీ చేశారు. కానీ భారీ తేడాతో పరాజయం పాలయ్యారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో మరోసారి పార్టీ మారే ఆలోచనలో బుట్టా రేణుక ఉన్నట్లు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆమె టీడీపీలోకి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. అందుకే మంత్రి ఆనంతో చర్చలు జరిపారనే ప్రచారం జోరందుకుంది. ఇక వైసీపీ మాజీ మంత్రి విడదల రజనీ కూడా పార్టీ మారతారనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.