సీతారాం ఏచూరిని రీప్లేస్ చేయడం కష్టమే !

అంతే కాదు ఆయన గత తొమ్మిదేళ్ళుగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా గతంలో తెర వెనక ఆయన కీలక పాత్ర పోషించారు అనే అంటున్నారు

Update: 2024-09-14 03:45 GMT

తాజాగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో అనారోగ్యంతో కన్ను మూసిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పార్టీకి నిజంగా అతి పెద్ద లోటునే మిగిల్చారు అని అంటున్నారు. ఆయన డైనమిక్ లీడర్ గా కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. అంతే కాదు ఆయన గత తొమ్మిదేళ్ళుగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నా గతంలో తెర వెనక ఆయన కీలక పాత్ర పోషించారు అనే అంటున్నారు

ముఖ్యంగా హరికిషన్ సింగ్ సుర్జీత్ ప్రధాన కార్యదర్శిగా ఉండగా సీతారాం ఏచూరి ఆయనతోనే ఉంటూ పార్టీ విధానాలను ప్రభావితం చేశారు. ఆయన సీపీఎం లో అట్టడుగు నుంచి ఎదిగారు. ఆర్ధికవేత్తగా రాజకీయ వ్యూహకర్తగా ఆయనకు ఎంతో పేరు ఉంది.

నిజానికి భారత కమ్యూనిస్టు పార్టీ నుంచి సీపీఎం విడిపోయి ఇప్పటికి ఆరు దశాబ్దాల కాలం అయింది. ఇంతటి సుదీర్ఘ కాలంలో కేవలం అయిదుగురు మాత్రమే ప్రధాన కార్యదర్శులుగా పనిచేశారు. అలా పనిచేసిన వారు అంతా ఉద్ధండులే. 1964లో ఆవిర్భవించిన సిపిఎంకు పుచ్చలపల్లి సుందరయ్య తొలి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన 1964 నుంచి 1978 దాకా ఏకంగా 12 ఏళ్ల పాటు వ్యవహరించారు. ఆయన తరువాత కేరళకు చెందిన ఈఎంఎస్ నంబూద్రిపాద్ 1978 నుంచి 1992 దాకా పద్నాలుగేళ్ల పాటు ఆ ఉన్నత పదవిలో ఉన్నారు

ఇక ఆయన నుంచి హరికిషన్ సింగ్ సూర్జిత్ బాధ్యతలు తీసుకుని 1992 నుంచి 2005 దాకా 13 ఏళ్ల పాటు బాధ్యతలు చూసారు. ఇక ప్రకాష్ కారత్ 2005 నుంచి 2015 దాకా పనిచేశారు. సీతారాం ఏచూరి 2015 - 2024 దాకా తొమ్మిదేళ్ల పాటు ఈ పదవిలో ఉన్నారు.

వీరిలో సీతారాం ఏచూరి మాత్రమే పదవిలో ఉండగా మరణించారు ఇప్పుడు సిపిఎం కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. దాని కోసం చాలా పేర్లు వినిపిస్తున్నా కూడా సీతారాం ఏచూరిని రీప్లేస్ చేయడం కష్టమే అని అంటున్నారు ఆయన బహుముఖ ప్రజ్ఞా ధురీణుడు. అన్ని పార్టీలతో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేశారు.

అంతే కాదు సీపీఎం రాజకీయ పంధాను ఆయన తనదైన కోణంలో చూసారు. నిజానికి సీపీఎం సీతారాం ఏచూరి బాధ్యతలు చేపట్టాక బెంగాల్ లో నిలదొక్కుకోలేదు, త్రిపురలో అధికారం పోగొట్టుకుంది. ఈ రోజున ఒక్క కేరళలో మాత్రమే ఉంది.

అయినా సరే సిద్ధాంత బలంతోనే పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలన్నది ఆయన ఆలోచన. దేశంలో ఇండియా కూటమి విషయంలోనూ ఆయన పట్టుదలగానే ఉన్నారు. అందులో వామపక్షాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

మోడీ బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చిన సీతారాం ఏచూరి దేశానికి ఆల్టరేషన్ రాజకీయ ఆర్ధిక విధానాలు ఉండాలని బలంగా కోరుకుంటూ వచ్చారు. అధికారంలోకి రావడం అన్న దాని కంటే భావజాలం బలంగా ఉండాలి జనంలో ఉండాలని ఆయన కోరుకున్నారు

ఆరేడు భాషలలో అనర్గళంగా మాట్లాడే సీతారాం ఏచూరి వామపక్ష రాజకీయాలను భారతదేశీకరణ చేశారు. ఈ దేశంలో రాజకీయం చేయాలంటే ఈ దేశం మూలాలను అందిపుచ్చుకునే పార్టీ ముందుకు సాగాలని ఆయన కోరుకున్నారు.

ఇపుడు ఆయన సాటి నేత ఎవరా అని సీపీఎం అన్వేషిస్తోంది. సిద్ధాంత నిబద్ధతతో నడిచే పార్టీలలో నెక్స్ట్ లీడర్ షిప్ ఎపుడూ ఉంటుంది. అయితే వచ్చిన వారితో సీతారాం ఏచూరితో పోలిక పెడితేనే కష్టం. ఒక విధంగా చెప్పాలంటే ఆయనది ప్రత్యేకమైన మార్క్. అది భర్తీ చేయడం కష్టమనే అంటున్నారు.

Tags:    

Similar News