తండ్రికి భిన్నంగా కోర్టులో బిహేవ్ చేసిన ఇవాంకా

నాలుగు గంటల పాటు కోర్టులో సాక్ష్యం ఇచ్చిన ఆమె.. చాలానే మాట్లాడినప్పటికి.. ఆమె మాటల్ని ఒక్క మాటలో తేల్చేయాలంటే చాలా తేలికని చెబుతున్నారు.

Update: 2023-11-10 03:54 GMT

తండ్రికి తగ్గ తనయులంటూ ఒక నానుడి తెలిసిందే. అమెరికా మాజీ అధ్యక్షుడు.. తాజాగా మరోసారి అధ్యక్ష ఎన్నికల రేసులో విపరీతంగా శ్రమిస్తున్న ట్రంప్ గారాలపట్టి ఇవాంకా ట్రంప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందే ఆయన వ్యాపారాల్ని.. దేశాధ్యక్షుడు అయ్యాక వైట్ హౌస్ లో ఉంటూ.. దేశాధ్యక్షుడి హోదాలో ఉన్న తన తండ్రికి సహాయకారిగా ఉండటం తెలిసిందే. వివాదాలకు దూరంగా ఉన్నప్పటికీ.. వివాదాలు ఆమె చుట్టూ ఉండటం తెలిసిందే.

తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందారన్న ఆరోపణలతో ట్రంప్ మీద నమోదైన కేసులో వాంగ్మూలాన్ని ఇవ్వటానికి ఇవాంకా కోర్టుకు ముందుకు రావటం.. విచారణలో పాల్గొనటం తెలిసిందే. నాలుగు గంటల పాటు కోర్టులో సాక్ష్యం ఇచ్చిన ఆమె.. చాలానే మాట్లాడినప్పటికి.. ఆమె మాటల్ని ఒక్క మాటలో తేల్చేయాలంటే చాలా తేలికని చెబుతున్నారు. ‘నాకేమీ గుర్తు లేదు’ అంటూ ఆమె చెప్పటం ఒక ఎత్తు అయితే.. కోర్టు హాల్లో ఆమె బిహేవ్ చేసిన వైనం పలువురిని ఆకర్షించింది.

తండ్రి ట్రంప్ తరహాలో దూకుడుగా.. న్యాయమూర్తితో వాదనలకు దిగినట్లుగా వ్యవహరించిన దానికి భిన్నంగా కామ్ గా.. కూల్ గా వ్యవహరిస్తూ తనను అడిగే ప్రశ్న ఏదైనా.. ఇరిటేట్ కాకుండా వ్యవహరించటం ఒక ఎత్తు అయితే.. ఎక్కడా బ్యాలెన్సు మిస్ కాకుండా హుందాగా వ్యవహరించిన ధోరణిని అందరిని ఆకట్టుకుందని చెబుతున్నారు. ‘కోర్టులో ఇవాంకా చాలా ప్రశాంతంగా వ్యవహరించారు. న్యాయవాదులతోనూ.. న్యాయమూర్తులతోనూ ఆమె ఎక్కడా వాదనకు దిగలేదు. న్యాయమూర్తి ఆర్థర్ ఎంగోరాన్ కోపంతో ప్రశ్నలు వేసినా ఆమె మాత్రం చెక్కు చెదరని ప్రశాంతతో ఉండిపోయారు. వారం క్రితం అదే కోర్టులో ఆమె తండ్రి ట్రంప్ వ్యవహరించిన ధోరణికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు’ అంటూ కోర్టులో కేసు ప్రొసీడింగ్స్ చూసిన పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం.

కోర్టు హాల్లో న్యాయమూర్తితో యుద్దం చేసినట్లు కాకుండా.. ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయకుండా.. చాలా మర్యాదగా వ్యవహరించారని ఇవాంకాను ప్రశంసిస్తున్నారు. ఆమె చెప్పిన వాంగ్మూలంలో ఏ ఒక్కటి నిజం లేదని.. కానీ ఆమె చెప్పిన మాటల్లో అత్యధికం.. నాకు గుర్తు లేదు.. నాకు తెలీదు.. అన్న మాటలే ఎక్కువని చెబుతున్నారు. తన నోటి నుంచి చెప్పే మాటలకు నిజమేనన్న భావన కలిగేలా ఆమె చెప్పిన మాటలు కొందరు గుర్తు చేసుకుంటూ.. తాను పన్నెండేళ్ల క్రితం గర్భవతిగా ఉన్నట్లుగా గుర్తు చేశారు. అప్పుడేదో ఒక కాల్ మాట్లాడినట్లుగా తనకు గుర్తు ఉంది కానీ అదేమిటన్నది గుర్తుకు రావటం లేదని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.

తన మాటలతో తనను అడుగుతున్న ప్రశ్నలన్ని పదేళ్లకు పైనవే అన్న విషయాన్ని ఆమె చెప్పకనే చెప్పేయటంతో పాటు.. తాను చెప్పిన సమాధానాలు ఎన్నో ఏళ్లు అయ్యింది.. ఎలా గుర్తు ఉంటాయన్న లాజిక్ కు సరిపోలేలా ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా నాలుగు గంటల పాటు కోర్టులో ఇవాంకా ఇచ్చిన వాంగ్మూలంతో ఎలాంటి ప్రభావాన్ని చూపదని చెబుతున్నారు. కాకుంటే.. కోర్టు హాల్లో ఆమె ప్రదర్శించిన బ్యాలెన్సు మాత్రం అందరిని ఆకర్షించేలా చేయటమే కాదు.. ప్రత్యేక కథనాలుగా ప్రచురితమైన పరిస్తితి. ఇవాంకానా మజాకానా అన్నట్లుగా ఆమె వ్యవహారశైలి ఉందని చెప్పాలి.

Tags:    

Similar News