ఎంపీతో గొడవ పెట్టుకున్న రవీంద్ర జడేజా భార్య.. వీడియో వైరల్!

ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఆ మధ్య గుజరాత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే.

Update: 2023-08-18 05:27 GMT

ఇండియన్ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా ఆ మధ్య గుజరాత్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రివాబా జడేజా.. తన తోటి బీజేపీ నేతలతో వాగ్వాదానికి దిగడం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అవును... ఆ మ‌ధ్య గుజ‌రాత్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన భార‌త క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా భార్య రివాబా త‌న తోటి బీజేపీ నేత‌ల‌తో వాగ్వాదానికి దిగారు. ఇందులో భాగంగా తోటి బీజేపీ మహిళానాయకురాళ్లైన మున్సిపల్ మేయర్ బినా కొతారి, ఎంపీ పూనంబెన్ మాదంతో గొడవ పెట్టుకున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జామ్‌ నగర్ లో "నా మట్టి - నా దేశం" కార్యక్రమం నిర్వహించారు. ఆ సమయంలోనే బీజేపీ నాయకురాళ్ల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వ్యవహారంపై రివాబా జడేజా స్పందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమర జవాన్లకు నివాళులు అర్పించే క్రమంలో ఎంపీ పూనంబెన్ మాదం పాదరక్షలు విప్పలేదు అని ఆరోపించారు.

ఇదే సమయంలో తాను మాత్రం అమర జవాన్లకు నివాళులు అర్పించే ముందు పాదరక్షలు విప్పినట్లు తెలిపారు. ఆ తర్వాత అక్కడున్న వారంతా తనను చూసి తనలాగే పాదరక్షలు విప్పి నివాళులు అర్పించారని అన్నారు. ఆ సమయంలో తనను ఎద్దేవా చేస్తూ ఎంపీ పూనంబెన్ కామెంట్స్ చేశారని, తనను ఓవ‌ర్ స్మార్ట్ అన్నారన్ని రివాబా జడేజా తెలిపారు.

ఇది చూసిన ఎంపీ.. ప్రధాన‌మంత్రి, రాష్ట్రప‌తి కూడా షూ వ‌ద‌లి నివాళి ఘ‌టించ‌రు. ఈమె ఓవ‌ర్ స్మార్ట్ గా బిహేవ్ చేస్తోందంటూ వ్యాఖ్యానించింద‌ట‌. దీంతో జ‌డేజా భార్యకు మరింత కోపం వ‌చ్చి త‌న పార్టీ నేతే అయిన‌ప్పటికీ ఎంపీ పై విరుచుకుప‌డిన‌ట్టుగా తెలుస్తోంది.

ఆ సమయంలో మేయర్ బినా కొతారీ అనవసరంగా జోక్యం చేసుకుని ఎంపీకి మద్దతుగా మాట్లాడడానికి ప్రయత్నించారట. దీంతో ఆమెను కూడా రివాబా జడేజా తగులుకున్నారట! మొత్తానికి ఈ బీజేపీ మ‌హిళా నేత‌ల మాట‌ల యుద్ధానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.

కాగా.. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య, బీజేపీ అభ్యర్థి రివాబా జడేజా జామ్‌ నగర్ నార్త్‌ నియోజకవర్గంలో దాదాపు 50,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కర్షన్ కర్మూర్ రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ అభ్యర్థి బిపేంద్రసింగ్ మూడో స్థానంలో నిలిచారు.

జామ్‌ నగర్ జిల్లాలో భాగమైన జామ్‌ నగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం 2008 డీలిమిటేషన్ తర్వాత ఉనికిలోకి వచ్చింది. ఇది జామ్‌ నగర్ లోక్‌ సభ నియోజకవర్గంలో ఒక భాగం.

Tags:    

Similar News