పాత కాపులే దిక్కు.. జగన్ మారాల్సిందే.. !
వైసీపీ అధినేత పాత కాపులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. పార్టీని స్థాపించినప్పుడు ఉన్న వారిని తీసుకుంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి(ఇప్పుడు వైసీపీలో లేరు) వంటి వారు కనిపిస్తారు.
వైసీపీని గమనిస్తే.. కొత్త వారికి ఇస్తున్న ప్రాధాన్యం పాతవారికి లేకుండా పోతోంది. కారణం ఏదైనా కావొచ్చు. సామాజిక వర్గం, ఆర్థికం, సిఫారసులు.. ఇలా అనేక కారణాలు ఉండి ఉండొచ్చు. కానీ, పాతకాపులను పక్కన పెట్టారన్న అపప్రద మాత్రం ఇప్పటికీ ఉంది. మంత్రివర్గం లో చోటు నుంచి నిర్ణయాలు తీసుకునే వరకు కూడా.. వైసీపీ అధినేత పాత కాపులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. పార్టీని స్థాపించినప్పుడు ఉన్న వారిని తీసుకుంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి(ఇప్పుడు వైసీపీలో లేరు) వంటి వారు కనిపిస్తారు.
కానీ, వారికి ప్రాధాన్యం ఇస్తున్నారా? అంటే ప్రశ్నగానే మిగులుతుంది. కొందరిని ఏరికోరి ఎంచుకుని పార్టీలో నియమించుకున్న పరిస్థితి .. తర్వాత వారే సర్వస్వం అనుకుని.. రెచ్చిపోయిన పరిస్థితి ఇప్పుడు పార్టీని దిగంబరం చేస్తోంది. పోనీ.. ఇలా తెచ్చుకున్నవారు ఎవరైనా పార్టీలో ఉన్నారా? అంటే అది కూడా లేదు. కానీ.. పాతవారు మాత్రం ఇప్పటికీ ఉన్నారు. పార్టీ కోసం పనిచేసినవారు.. పార్టీ కోసం.. జైలుకు వెళ్లిన వారు కేసులు పెట్టించుకున్నవారు ఉన్నారు. కానీ, ఇదే సమయంలో కేసులకు భయపడుతు న్నవారు వెళ్లిపోతున్నారు.
పాతకాపులకు ప్రాధాన్యం ఇచ్చే విషయంలో వైసీపీ వేసిన తప్పుటడులు.. ఇప్పుడు కూడా కొనసాగిస్తే.. అది మున్ముందు జెండా మోసే వారిపైనే ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికైనా.. పార్టీని మరింతగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇప్పుడు వైసీపీలో ఉన్న చాలా మంది కొత్తవారికి కూడా వారికి అవకాశం లేక.. కొనసాగుతున్నారే తప్ప.. అవకాశం వస్తే.. ఈ క్షణం వెళ్లిపోయేందుకు రెడీగా ఉన్నారు. కాబట్టి.. ఎప్పటికైనా జగన్‌తో నడిచేది.. జగన్ కోసం ఆలోచించేది పాతకాపులే. అది ఒక్క వైసీపీలోనే కాదు.. ఇతర పార్టీల్లోనూ కనిపిస్తుంది.
కొత్తవారికి ప్రాదాన్యం ఇవ్వడం తప్పుకాదు. కానీ.. పాత వారిని విస్మరించడం ప్రధాన తప్పు. ఇదే వైసీపీలో గత ఐదేళ్లు జరిగింది. తాను తీసుకువచ్చిన నాయకుడికి మంత్రి పదవి ఇచ్చి.. తనను డమ్మీ చేయడం ఏంటని.. కొందరు నాయకులు బహిరంగ వ్యాఖ్యలే చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా.. నాయకులను నాన్చి పెట్టడం కూడా.. పార్టీలో అసంతృప్తికి దారి తీసింది. సో.. ఈ పరిణామాలను సాధ్యమైనంత త్వరగా సమీక్షించుకుని.. బయట పడితేనే వైసీపీకి మనుగడ. ఇప్పటికైనా పాతకాపులకు ప్రాధాన్యం ఇచ్చే దిశగా జగన్ అడుగులు వేయాల్సి ఉంటుంది.