పోలీసు విచారణకు జగన్ పైలెట్.. కో పైలెట్ వస్తున్నారా?

అంతేకాదు.. సదరు హెలికాఫ్టర్ ను దెబ్బ తిన్న తర్వాత అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న విషయం తర్వాత వెలుగు చూసింది.;

Update: 2025-04-16 05:12 GMT
పోలీసు విచారణకు జగన్ పైలెట్.. కో పైలెట్ వస్తున్నారా?

శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య ఫ్యామిలీని పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఆ గ్రామానికి రావటం.. ఆ సందర్భంగా హెలికాఫ్టర్ లో వచ్చిన ఆయన్ను చూసేందుకు భారీగా జగన్ అభిమానులు పోటెత్తటం తెలిసిందే. ఈ క్రమంలో హెలికాఫ్టర్ విండ్ షీల్డ్ విరిగినట్లుగా పేర్కొన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో జగన్ ప్రయాణించిన వైనం తెలిసిందే. విండ్ షీల్డ్ విరిగిన అనంతరం.. సదరు హెలికాఫ్టర్ ఎక్కడకు వెళ్లింది? ఏమైంది? అన్న వివరాలపై అధికారులకు సమాచారం లేదు.

అంతేకాదు.. సదరు హెలికాఫ్టర్ ను దెబ్బ తిన్న తర్వాత అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న విషయం తర్వాత వెలుగు చూసింది. అసలు హెలిప్యాడ్ వద్ద ఆ రోజున చోటు చేసుకున్న పరిణామాలపై అధికారులు విచారిస్తుననారు. ఇందులో భాగంగా హెలికాఫ్టర్ సమకూర్చిన సంస్థ కర్ణాటకలోని జక్కూరులో ఉంది. అయితే.. విండ్ షీల్డ్ దెబ్బ తిన్నదని చెప్పిన సదరు హెలికాఫ్టర్.. జక్కూరుకు వెళ్లకపోవటాన్ని అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ రోజు (బుధవారం) పైలెట్.. కో పైలెట్ ఇద్దరు వ్యక్తిగతంగా చెన్నేకొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు రావాల్సి ఉంటుందని పోలీసులు నోటీసులు జారీ చేశారు. జగన్ వదిలేసిన తర్వాత సదరు హెలికాఫ్టర్జక్కూరుకు వెళ్లలేదని.. విండ్ షీల్డ్ దెబ్బ తిన్నట్లుగా పైలెట్ కానీ.. కో పైలెట్ కానీ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. ఈ మొత్తం ఇష్యూపై నిగ్గు తేల్చేందుకు వలుగా నోటీసులు జారీ చేసినట్లుగా చెబుతున్నారు. పోలీసులు పేర్కొన్నట్లుగా ఈ రోజు సదరు పైలెట్.. కో పైలెట్ లు పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News