ఇదేం పద్ధతి... జనం మెచ్చరు జగన్ గారూ.. !
ఒకానొక దశలో పోడియంను కూడా ముట్టడించారు. దీంతో సభలో పెద్ద ఎత్తున వివాదం రేగిం ది. గవర్నర్ ప్రసంగానికి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అసెంబ్లీకి వచ్చేది లేదని పదే పదే చెప్పిన జగన్.. ఎట్టకేలకు సభకు వచ్చారు. సోమవారం ప్రారంభమైన సభకు వచ్చిన ఆయన.. వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. తొలి రోజు సభకు వచ్చిన జగన్ ఆయన ఎమ్మెల్యేలు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డు పడ్డారు. బిగ్గరగా నినాదా లు చేశారు. ఒకానొక దశలో పోడియంను కూడా ముట్టడించారు. దీంతో సభలో పెద్ద ఎత్తున వివాదం రేగింది. గవర్నర్ ప్రసంగానికి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది.
అయితే.. ప్రతిపక్షంలో ఉన్నవారు.. సహజంగానే అసెంబ్లీలో ఇలానే వ్యవహరిస్తున్నారు. పార్లమెంటు నుంచి అసెంబ్లీల వరకు కూడా ఇలానే ప్రతిపక్షం నేతలు వ్యవహరిస్తూ.. తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తు న్నారు. అయితే.. ఇలా.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే విషయంలో విపక్షాలు.. ప్రజల సమస్యలను ప్రస్తావిస్తాయి. ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించి.. ప్రభుత్వం తాలూకు గవర్న ర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాయి.
మరోవైపు.. గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న ప్రభుత్వ అనుకూల విధానాలను ప్రతిపక్షం తప్పుబడుతుంది. దీనిని హైలెట్ చేసుకునేందుకు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించివేసి ఎగరేసే ప్రయత్నం చేయడం కూడా సభల్లో కామన్‌గానే జరుగుతుంది. అయితే.. తాజాగా జగన్ అండ్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు.. మాత్రం ప్రసంగ ప్రతులను చించేయలేదు. అదేసమయంలో గవర్నర్‌కు వ్యతిరేకంగా కూడా వ్యాఖ్యానించలేదు. అదే సమయంలో ప్రజల గురించి కూడా పట్టించుకోకపోవడం.. మైనస్ అయింది.
సాధారణంగా సమావేశాల్లో వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై చర్చించి ఉంటే.. పోనీ.. గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్న అంశాలపైనే తమ పాలనలో జరిగిన విషయాలపై దుయ్యబట్టినప్పుడు అయినా.. వైసీపీ స్పందించి.. అలా కాదు.. ప్రజలు మేం మంచి చేశాం.. అని చెప్పి ఉంటే బాగుండేది. కానీ, అలా చేయలేకపోయింది. పైగా.. వ్యక్తిగత లబ్ధి కోసం.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని నిలదీయడానికి మాత్రమే పరిమితం అయింది. వాస్తవానికి ఈ విషయాన్ని ప్రజలకు వదిలి పెట్టి.. ప్రజల సమస్యలను వైసీపీ పట్టించుకుని ఉంటే ఆ రేంజ్ వేరేగా ఉండేదని అంటున్నారు పరిశీలకులు.