ఈవీఎంల మీద పోరులో జగన్ కాంగ్రెస్ ఒక్కటవుతారా ?
దాంతో ఏదో జరిగింది అంటూ కాంగ్రెస్ పెద్దలు డౌట్లు వ్యక్తం చేయడం మొదలెట్టారు.
కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అనూహ్యంగా ఓటమి పాలు అయింది. మధ్యాహ్నం వరకూ ఫలితాల తీరు ఒకలా వచ్చి ఆ తరువాత ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఏకంగా 18 సీట్ల నుంచి బీజేపీ 48కి ఎగబాకి అక్కడ ఫిక్స్ అయింది. కాంగ్రెస్ అయితే మొదట్లో 55 పై దాటి నంబర్ కనిపించింది. ఇక చివరికి చూస్తే 37 దగ్గర ఫిక్స్ అయింది.
దాంతో ఏదో జరిగింది అంటూ కాంగ్రెస్ పెద్దలు డౌట్లు వ్యక్తం చేయడం మొదలెట్టారు. నిజానికి హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఈసారి ఓట్లూ సీట్లూ బాగా పెరిగాయి. ఆ పార్టీ 40 శాతం ఓటు షేర్ ని సాధించింది. బీజేపీకి 39 శాతం ఓటు షేర్ దక్కింది. కానీ సీట్లలో మాత్రం రెండు పార్టీల మధ్య తేడా పదకొండు సీట్లుగా ఉంది.
దీంతో ఏదో జరిగే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేష్ నుంచి చాలా మంది అనుమానిస్తున్నారు. రాహుల్ గాంధీ అయితే దీని మీద ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్ వాదనకు ఇండియా కూటమిలో మద్దతు సంగతి పక్కన పెడితే భిన్న అభిప్రాయాలు వినిపించాయి. ఆప్ అయితే మితిమీరిన అతి విశ్వాసంతో కాంగ్రెస్ హర్యానాలో బొక్క బోర్లా పడింది అంటోంది.
కాంగ్రెస్ తో కలసి కాశ్మీర్ లో కూటమి కట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ అయితే కాంగ్రెస్ ముందు హర్యానా ఓటమి మీద ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించింది.ఇలా వేటికవే మాట్లాడుతున్న వేళ అనూహ్యంగా వైసీపీ నుంచి కాంగ్రెస్ కి మద్దతు స్వరం వినిపించడం విశేషం. జగన్ అయితే బీజేపీ మీద విమర్శలు డైరెక్ట్ గానే చేశారు. ఈవీఎంల పనితీరు బాలేదని అన్నారు.
తమకు ప్రజలలో మద్దతు ఉన్నా ఘోరంగా ఓటమి ఎదురైంది అని ఆయన నాలుగు నెలల క్రితం నాటి ఫలితాలను గుర్తు చేసుకున్నారు. దేశంలో బ్యాలెట్ విధానం రావాలని కోరుతున్నారు విజయసాయిరెడ్డి అదే మాట అంటున్నారు. ఈవీఎంల మీద ఈ ఇద్దరు నేతలూ కాంగ్రెస్ తరహాలో డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కాంగ్రెస్ కి వైసీపీ నుంచి ఫుల్ సపోర్టు వచ్చిందని అంటున్నారు. అయితే బీజేపీని ఇలా డైరెక్ట్ గా జగన్ వ్యతిరేకించడానికి కారణం ఆ పార్టీతో ఇక కలయిక ఉండదని చెప్పడమే అంటున్నారు. ఎటూ జనసేన సనాతన ధర్మం హిందూత్వ తో ఉంది. బీజేపీకి అలా శాశ్వత మిత్రుడు దొరికారు అని అంటున్నారు. మరో వైపు టీడీపీ కూడా తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎన్డీయేను వీడదు అని అంటున్నారు. దాంతో వైసీపీకి జాతీయ స్థాయిలో ఇండియా కూటమి తోనే అంతా అని అంటున్నారు. కాంగ్రెస్ ఓటమి చెంది కొంత వీక్ అయిన వేళ ఆ పార్టీ వైపుగా ఉంటే ఫ్యూచర్ లో ఏపీలో పొత్తులకు అవకాశం ఉండొచ్చు అని అంటున్నారు.
మరి ఈవీఎంల మీద పోరుకు కాంగ్రెస్ తో భుజం కలిపి వైసీపీ ముందుకు వస్తుందా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. జగన్ చాలా కాలం తరువాత కాంగ్రెస్ కి అనుకూలంగా బీజేపీకి యాంటీగా బాహాటంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు అని అంటున్నారు. హర్యానా ఫలితాలు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వచ్చాయని ఆయన చెప్పడం అంటే మోడీ సర్కార్ కి ఎదురు నిలవడమే అని అంటున్నారు.
ఏపీ ఫలితాలు అలాగే వచ్చాయని ఆయన పోలిక కూడా పెట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసం ముఖ్యం అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ పేపర్ మీద ఎన్నికలు పెడుతూంటే భారత్ లో ఈవీఎంలు ఎందుకు అని ఆయన అంటున్నారు. ఈవీఎంల విషయంలో కాంగ్రెస్ మండిపడుతున్న వేళ జగన్ చేసిన ఈ కామెంట్స్ హస్తం పార్టీకి చాలా తీయగానే ఉంటాయని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో ఏ రకమైన రాజకీయ పరిణామాలు సంభవిస్తాయన్నది చూడాల్సి ఉందని అంటున్నారు.