కూటమికి జగన్ అంటే భయం?

తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అభ్యంతరం ఏముందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Update: 2024-11-12 03:17 GMT

అవునా. ఇది నిజమేనా. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇదే చెబుతున్నారు. ఎక్కడ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి సభలో మైకు ఇస్తే కూటమి చేసిన తప్పులను నిలదీస్తారో అన్న భయంతోనే హోదా ఇవ్వడం లేదని జగన్ ఆరోపించారు ఆయన శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీ పక్ష సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు.

సభలో తామే ఏకైక ప్రతిపక్షంగా ఉన్నామని , పైగా 40 శాతం ఓటింగ్ సాధించిన పార్టీగా ఉన్నామని ఆయన చెప్పారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అభ్యంతరం ఏముందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సభలో గట్టిగా ప్రశ్నిస్తామని కూటమి ప్రభుత్వ పెద్దలకు భయం పట్టుకుందని జగన్ అన్నారు. వైసీపీకి హోదా ఇవ్వడం అందుకే వారికి ఇష్టం ఉండటం లేదని అన్నారు. ఈ రకమైన ఆలోచనలు ఉండడం వల్లనే ఇలా చేస్తున్నారని జగన్ ఆక్షేపించారు.

ఇక శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని నిగ్గదీయాలని ఆయన కోరారు. మరో వైపు చూస్తే తాము ప్రతీ రోజూ మీడియా ముందుకు వచ్చి మరీ కూటమి ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను పూర్తి వివరాలూ ఆధారాలతో సహా ప్రశ్నిస్తామని జగన్ స్పష్టం చేశారు.

ఈ విధంగా జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్ హాజరు కావడాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం పట్ల రాజకీయ విమర్శలతో పాటు జనంలో కూడా చర్చ సాగుతూండడం వల్లనే జగన్ ఈ విధంగా వివరణ ఇస్తున్నారు అని అంటున్నారు. అయితే ఇది ఎంతవరకూ జనాలకు రీచ్ అవుతుంది వారు ఏ మేరకు అర్ధం చేసుకుంటారు అన్నది చూడాల్సి ఉంది.

మరో వైపు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ సభకు రాకపోవడం పట్ల పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఎవరో సభకు రారని సభా కార్యక్రమాలు ఆగేది ఉండదని అన్నారు. ఏ ఒక్కరి కోసమే అసెంబ్లీ లేదని అన్నారు. ఎమ్మెల్యేగా నెగ్గిన ప్రతీ వారు సభకు వచ్చి ప్రజా సమస్యల మీద చర్చించాల్సి ఉంటుందని అన్నారు. సభకు రావడం ప్రజల కోసం మాట్లాడటం సభ్యుల బాధ్యత అని అన్నారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు సభకు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రజా సమస్యల మీద అవగాహన పెంచుకుని చర్చలలో పాల్గొనాలని బాబు కోరారు.

Tags:    

Similar News