జగన్ ఈసారైనా అలా చేస్తారా ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట తప్పను మడమ తిప్పను అంటూంటారు. అయితే ఆయన అయిదేళ్ళ పాలనలో సంక్షేమ కేలండర్ అమలు చేసి చూపించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట తప్పను మడమ తిప్పను అంటూంటారు. అయితే ఆయన అయిదేళ్ళ పాలనలో సంక్షేమ కేలండర్ అమలు చేసి చూపించారు. హామీలు చాలా వరకూ నిలబెట్టుకున్నారు. కానీ జగన్ సీఎంగా ఉండగా రచ్చబండ కార్యక్రమం చేస్తామని పల్లె నిద్ర చేస్తామని చెప్పారని ప్రచారం సాగింది.
కానీ ఆయన అయిదేళ్ళలో బహిరంగ సభలలో తప్ప జనం వద్దకు రాలేదు. అదే ఆయన పార్టీ ఓటమికి కారణం అయింది. ఇకపోతే జగన్ ఓటమి తరువాత జనంలోకి వస్తాను అంటున్నారు. ఆ మేరకు ఆయన డిసెంబర్ నుంచి జనంలోకి అని మొదట అన్నారని ప్రచారం సాగింది
ఆ తరువాత జనవరిలో అన్నారు. అయితే ఆయన ఇపుడు లండన్ టూర్ లో ఉన్నారు. ఇక చూస్తే ఫిబ్రవరి నెల నుంచి జగన్ జిల్లాల టూర్ ఉంటుందని అంటున్నారు. మరి జగన్ ఆ విధంగా చేస్తారా చెప్పిన టైం కి ఈసారి షెడ్యూల్ ప్రకారం అయినా వస్తారా అన్న చర్చ అయితే సాగుతోంది.
మరో వైపు చూస్తే జగన్ వచ్చి జనంలో ఏమి చెబుతారు అన్నది కూడా చర్చకు వస్తున్న విషయం. ఆయన సూపర్ సిక్స్ హామీల గురించి మాట్లాడుతారని ప్రభుత్వం ఏమీ చేయలేదని చెబుతారని అంటున్నారు. కానీ ఆ అవకాశం ఏదీ జగన్ కి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం కొన్ని పధకాలను అమలు చేయడానికి చూస్తుందని అంటున్నారు.
నిజానికి జగన్ డిసెంబర్ నెల నుంచి జనంలోకి వచ్చి పధకాలు అమలు జరగలేదని చెప్పి ఉంటే ఆ తరువాత ప్రభుత్వం వాటిని అమలు చేసినా తన ఒత్తిడి వల్లనే అని చెప్పుకోవడానికి అవకాశం ఉండేదని అంటున్నారు. ఇపుడైనా జగన్ ఫిబ్రవరిలో టూర్ చేస్తే జనంలోకి రావడానికి సరైన పాయింట్లు ఉంటాయని అంటున్నారు.
నిజానికి వైసీపీ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద నిర్మాణాత్మకమైన విమర్శలు చేయడంలో విఫలం అవుతోందని అంటున్నారు వైసీపీలో జోష్ కూడా కనిపించడం లేదు. అదే టీడీపీ ఓటమి పాలు అయ్యాక చంద్రబాబు అతి కొద్ది కాలం నుంచే మీడియా ముందుకు రావడం ప్రతీ ఇష్యూని టేకప్ చేస్తూ జనంలో ఉంచడం ద్వారా డే వన్ నుంచి వైసీపీ తప్పులు ఇవీ అని చెప్పగలిగారు అని అంటున్నారు.
ఈ విషయంలో మాత్రం వైసీపీ సక్సెస్ కాలేకపోతోంది అంటున్నారు. ఏపీలో కూటమి పట్ల వ్యతిరేకత ఉందని వైసీపీ అధినాయకత్వం భావిస్తే చాలదని దానిని జనం సాక్షిగా ఎప్పటికపుడు రుజువు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ పొలిటికల్ లాజిక్ ని వైసీపీ మిస్ అవుతోదని అంటున్నారు. ఇక చెప్పిన షెడ్యూల్ ప్రకారం వైసీపీ కార్యక్రమాలకు శ్రీకారం చుడితేనే పార్టీ గాడిన పడుతుందని అంటున్నారు. మొత్తం మీద ఫిబ్రవరిలో కనుక వైసీపీ అధినేత జగన్ లోకి రాకపోతే ఆ పార్టీ మరింతగా నిరాశలోకి పోతుందని అంటున్నారు.