సొంత ఇలాకాలో జగన్
మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత ఇలాకా అయిన కడప జిల్లా పులివెందులలో మూడు రోజుల పాటు గడపనున్నారు.
మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత ఇలాకా అయిన కడప జిల్లా పులివెందులలో మూడు రోజుల పాటు గడపనున్నారు. ఇటీవల కాలంలో వైఎస్సార్ కుటుంబంలో చెలరేగిన కల్లోలం నేపథ్యంలో జగన్ పులివెందుల టూర్ ఆసక్తిని కలిగిస్తోంది. మరో వైపు చూస్తే ఆస్తుల విషయంలో సొంత అన్ననే ఎదిరించి ఆయనను ఏకంగా విషపు నాగుగా అభివర్ణించిన చెల్లెమ్మ షర్మిల మీద వైసీపీ శ్రేణులు అంతా ఎంతలా దుమ్మెత్తిపోశాయో తెలిసిందే.
వైఎస్సార్ అంటే కడప కేరాఫ్ పులివెందుల అన్నట్లుగా ఉండే కుటుంబ ప్రతిష్ట కాస్తా ఇటీవల అన్న చెల్లెలు ఆస్తుల వివాదం నేపధ్యంలో రచ్చగా మారి వైఎస్సార్ అభిమానులను కలతకు గురి చేసింది ఈ క్రమంలో జగన్ పులివెందులకు వెళ్తున్నారు. అక్కడ ఆయన మూడు రోజుల పాటు ఉండనున్నారు
ఆయన ఈ సందర్భంగా ఇడుపులపాయకు కూడా వెళ్తారు అని అంటున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ బాగా ఆందోళనకు గురి అయ్యారు అని అంటున్నారు. దాంతో ఆయన అక్కడ కొంతసేపు సేదతీరుతారు అని అంటున్నారు.
మరో వైపు ఇటీవల కాలంలో జగన్ పులివెందుల రావడం కొంత టైం తీసుకునే అయింది అని అంటున్నారు. అంతే కాదు ఆయన రాక కోసం అభిమానులు అంతా ఎదురుచూస్తున్నారు. ఇక మూడు రోజుల పాటు పులివెందులలో గడపనున్న జగన్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు అని అంటున్నారు. అలాగే పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన స్థానిక సమస్యలను తెలుసుకుని వాటి మీద పోరాటం చేస్తారు అని అంటున్నారు. అదే విధంగా పార్టీ నేతలు కార్యకర్తలతో సైతం జగన్ భేటీలు వేస్తారు అని అంటున్నారు.
పులివెందులలో పార్టీ నేతల పరిస్థితి వారి ఆలోచనలు కూడా అడిగి తెలుసుకుంటారు అని అంటున్నారు. అదే విధంగా సొంత జిల్లా కడపలో కూటమి రాజకీయం మూడు పార్టీల నేతల తీరు తెన్నుల మీద కూడా జగన్ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ని తీసుకుంటారు అని అంటున్నారు.
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ మొత్తం పది అసెంబ్లీ సీట్లకు గానూ నాలుగు సీట్లనే గెలుచుకుంది. దాంతో సొంత ఇలాకాలో వైసీపీ ప్రాభవం తగ్గుతోంది ఫ్యాన్ గాలి కూడా స్పీడ్ తగ్గింది అని ఒక విశ్లేషణ ఉండనే ఉంది. దాంతో జగన్ ఇంటిని చక్కదిద్దుకునే పనిలో ఉన్నారని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ పులివెందుల టూర్ ఈసారి అయితే ఆసక్తిని రేపుతోంది.
ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ కుటుంబంతో కూడా భేటీలు వేస్తారు అని అంటున్నారు. అంటే అన్నా చెల్లెలు సమరంలో ఎవరు ఏమిటి అన్నది కూడా తెలిసే అవకాశం ఉంది. బెంగళూరు నుంచి నేరుగా జగన్ ఇడుపులపాయకు చేరుకోవడంతో ఆయన టూర్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు.