ఆయనను పక్కన పెట్టండి జగనన్నా.....షాకింగ్ అడ్వైజ్ !

అలా జగన్ కి ఎంతో సన్నిహితులుగా ఉన్న పులివెందుల వైసీపీ క్యాడర్ సజ్జల విషయంలో అయితే షాకింగ్ అడ్వైజ్ ఇచ్చేశారు అని అంటున్నారు.

Update: 2024-12-27 16:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కి తన సొంత నియోజకవర్గం పులివెందుల క్యాడర్ నుంచే షాక్ ఎదురైంది అని ప్రచారం సాగుతోంది. జగన్ పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలి వచ్చింది క్యాడర్.

ఇక పులివెందుల క్యాడర్ చాలా నిర్మొహమాటంగా ఉంటారు. వారు జగన్ తో చనువుగా కూడా ఉంటారు. అందుకే వారు వైసీపీ ఎదుర్కొంటున్న సమస్యల మీద తమదైన తీరులో జగన్ కి సలహాలు ఇచ్చారు. పార్టీ బాగుండాలంటే ఏమి చేయాలో కూడా సూచించారు.

అంతే కాదు వైసీపీ ఎందుకు ఓటమి పాలు అయిందో కూడా తమదైన విశ్లేషణ జగన్ కి వినిపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ఓటమికి ప్రధాన కారకులలో ఒకరని కూడా పులివెందుల వైసీపీ క్యాడర్ కుండబద్ధలు కొట్టినట్లుగా భోగట్టా. వైసీపీ దారుణంగా ఓటమి పాలు అయింది ఎవరి ఓటమికి కారకులో ఇంకా తెలుసుకోకపోతే ఎలా జగనన్నా అంటూ సున్నితంగానే చెప్పాల్సింది చెప్పేశారు అని అంటున్నారు.

ఇంత జరుగుతున్నా ఇంకా సజ్జలను పక్కన పెట్టవా అంటూ కొందరు అడిగినట్లుగా చెబుతున్నారు. జగన్ అంటే వారికి చనువు. అ చనువుతోనే వారు అలా అడిగారు. అంతే కాదు జగన్ మీద ఉన్న అభిమానంతో వారు ఆయనతో గట్టిగా మాట్లాడుతారు, వాదులాడుతారు అని అంటారు.

అలా జగన్ కి ఎంతో సన్నిహితులుగా ఉన్న పులివెందుల వైసీపీ క్యాడర్ సజ్జల విషయంలో అయితే షాకింగ్ అడ్వైజ్ ఇచ్చేశారు అని అంటున్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలి అంటే కనుక కచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారని అంటున్నారు.

అంతే కాదు సజ్జల వంటి వారిని పక్కన పెట్టి తీరాల్సిందే అని పులివెందుల వైసీపీ కార్యకర్తలు కోరారని అంటున్నారు. అయితే వైసీపీ ఓటమికి సజ్జల కారణం అని తన సొంత నియోజకవర్గం క్యాడర్ చెప్పేసరికి జగన్ కూడా షాక్ తిన్నారని అంటున్నారు. అవునా అని ఆయన వారితో అన్నట్లుగా చెబుతున్నారు.

సరేలే అని జగన్ వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారుట. అయితే ఊరికే తలూపడం కాదు జగనన్నా సజ్జలను పార్టీ నుంచి పక్కన పెట్టి తీరాల్సిందే అని వారు గట్టిగా కోరారని అంటున్నారు. దాంతో జగన్ కూడా అలాగే అంటూ చెప్పారని చెబుతున్నారు.

ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి సకల శాఖల మంత్రిగా సజ్జల వ్యవహరిస్తున్నారు అన్న అపకీర్తిని మూటగట్టుకున్నారు. ఇక పార్టీ ఓటమి పాలు కాగానే అన్ని వేళ్ళూ ఆయన మీదకే చూపించాయి. అయినా సరే వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ పదవిని ఆయనకు జగన్ ఇచ్చారు. ఓటమి చెంది ఆరు నెలలు అయినా సరైన దిశగా ప్రక్షాళన జరగడం లేదు అని అంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో పులివెందుల క్యాడరే జగన్ కి వైసీపీ రిపేర్ల గురించి చెప్పిందని ఎవరి వల్ల పార్టీ ఇబ్బందులు పడుతుందో వారిని పక్కన పెట్టమని ఖరాఖండీగా తెలియచేసింది అని అంటున్నారు. మరి జగన్ సొంత నియోజకవర్గం క్యాడర్ ఇచ్చిన ఈ సలహాను ఏ విధంగా తీసుకుంటారు, యాక్షన్ ఎలా ఉంటుంది అన్నది చూడాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News