ఆ విషయంలో స్పష్టత కోసం జగన్ బిజీ ప్రయత్నం..!
అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. గతంలో 151 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైపోయింది.
ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రధానంగా వైసీపీ కీలక నేత, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి బై బై చెప్పడంతో వైసీపీలో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఈ విషయంపై జగన్ కు ముందే క్లారిటీ ఉండటంతో.. మిగిలిన నేతలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది! చాపకింద నీరులా పరిస్థితులు పాకేస్తున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయని అంటున్నారు!
అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. గతంలో 151 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైపోయింది. ఇక బలంగా ఉన్న మండలిలోనూ నేతలు జారుకుంటున్న పరిస్థితి! ఈ సమయంలో బొత్సను ఎమ్మెల్సీ చేసి, మండలి విపక్ష నేతగా పంపించారు జగన్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీల బాధ్యత ఆయనపై పెట్టారని అంటున్నారు.
అయితే... నిన్నమొన్నటి వరకూ చాలా మంది వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేయబోతున్నారంటూ కథనాలొచ్చినా.. అది నిజం కాలేదు!! ఈ విషయంలో ప్రధానంగా మాజీ మంత్రుల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే చాలా మంది ఊహించినట్లుగానే బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. దీంతో... జగన్ అలర్ట్ అయినట్లు చెబుతున్నారు.
ఇటీవల తిరుపతి జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించిన జగన్... జిల్లా నేతలకు కీలక సూచనలు చేశారు. అందులో.. కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలనేది ప్రధానమైన సూచన అని తెలుస్తోంది. ఇదే క్రమంలో... బుధవారం నెల్లూరు జిల్లా నేతలతో భేటీ అయిన జగన్... తాజాగా ఉత్తరాంధ్ర జిల్లా నేతలతోనూ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఇందులో భాగంగా... శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల నేతలతో భేటీ అయారు. ఇదే సమయంలో రానున్న రోజుల్లో మిగిలిన జిల్లాల నేతలతోనూ జగన్ భేటీలు అవనున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులను వారిని అడిగి తెలుసుకుంటున్న జగన్... పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించాలని సూచించారని తెలుస్తోంది.
ఇదే సమయంలో... ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఆయా నేతలు పార్టీ మారకుండా చర్చలు జరపాలని.. ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలని సూచించారని సమాచారం! ఇలా బాలినేని, సామినేని మొదలైన నేతల షాకుల నేపథ్యంలో జగన్ అలర్ట్ అయ్యారని.. ఎవరు మనవారు, ఎవరు పరాయివారు, మనతో ఉండే దెవరూ, తనతో నడిచే దెవరూ అనే విషయాలపై స్పష్టత కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.
మరి ఈ వరుస భేటీలతో జగన్ కు క్లారిటీ వస్తుందా, జంపింగులను ఆపగలుగుతారా.. లేక, షాకు తగిలిన తర్వాత తేరుకుని చూసుకోవడమేనా అనేది వేచి చూడాలి!