అదానీ వ్యవహారంపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్... మీడియా సంస్థలకు డెడ్ లైన్!

ఈ వ్యవహారంపై తాజాగా వైఎస్ జగన్ స్పందించారు. దీనిపై ఫుల్ క్లారిటీ ఇస్తూ.. తనపై ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపిస్తూ వారికి 48 గంటలు డెడ్ లైన్ విధించారు.

Update: 2024-11-28 16:54 GMT

సోలార్ విద్యుత్ వ్యవహారంలో వైఎస్ జగన్ కు అదానీ సంస్థలు లంచం ఇచ్చాయని.. ఈ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ధృవీకరించాయంటూ మీడియాలో కథనాలు, వాటికి సోషల్ మీడియాలో కామెంట్లు తీవ్ర వైరల్ అవుతున్న వేళ... ఈ విషయంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో జగన్ పేరుపై ఒక వర్గం మీడియాలో తీవ్ర ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. జగన్ కు అదానీ గ్రూప్ 1,700 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారంటూ తీవ్ర ప్రచారం జరిగింది! ఇక... అదిగో తోక అంటే ఇదిగో పులి అన్నట్లుగా సోషల్ మీడియాలోనూ పుంకాను పుంకాలుగా పోస్టులు వెలిశాయి.

ఈ వ్యవహారంపై తాజాగా వైఎస్ జగన్ స్పందించారు. దీనిపై ఫుల్ క్లారిటీ ఇస్తూ.. తనపై ఒక వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపిస్తూ వారికి 48 గంటలు డెడ్ లైన్ విధించారు. ఈ క్రమంలో.. డిసెంబర్ 1న సెకీ.. రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగిందని.. ఒప్పందంలో సెకీ, ఏపీ ప్రభుత్వం, డిస్కంలు సంతకాలు చేశాయని జగన్ తెలిపారు.

2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ నుంచి లేఖ వచ్చిందని.. యూనిట్ కు రూ.2.49 కి విద్యుత్ ఇస్తామని అందులో సెకీ పేర్కొందని.. ఐఎస్ టీఎస్ ఛార్జీలు లేకుండా సెకీ ఆఫర్ చేసిందని.. 9 వేల మెగావాట్ల సోలార్ పవర్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఇది ఏపీ చరిత్రలో అతి తక్కువకు చేసుకున్న ఒప్పందం జగన్ స్పష్టం చేశారు.

ఈ క్రమంలో ఉచిత విద్యుత్ కు రూ.9వెల కోట్లకు పైగా ఖర్చు చేశామని చెప్పిన జగన్... రాష్ట్రానికి మంచి చేస్తే బురద జల్లుతున్నారని అన్నారు. చంద్రబాబు పీపీఏల వల్ల రాష్ట్ర ప్రభుత్వం యూనిట్ కు అదనంగా రూ.3.41 కట్టాలని.. ఫలితంగా చంద్రబాబు నిర్ణయం వల్ల ఏడాదికి రూ.1,500 కోట్లు అదనపు భారం పడిందని తెలిపారు.

ఇదే వైసీపీ ప్రభుత్వ హయాంలో సృష్టించిన సంపద లక్ష కోట్ల రూపాయలు అని జగన్ నొక్కి చెప్పారు. ఇదే సమయంలో... చంద్రబాబు హయాంలో రూ.87 వేల కోట్ల సంపద ఆవిరైందని జగన్ అన్నారు.

మీడియాకు డెడ్ లైన్!:

గౌతం అదానీపై అమెరికాలో నమోదైన కేసుల్లో తన పేరు ఉందన్న ప్రచారంపైనా జగన్ స్పందించారు. ఆ ఆరోపణల్లో తన పేరు ఎక్కడా లేదని, అది ఉత్త మూర్ఖపు ప్రచారం మాత్రమేనని అన్నారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు రాతలు రాస్తున్నాయంటూ రెండు పత్రికలకు డెడ్ లైన్ విధించారు!

ఈ సందర్భంగా... సీఎంలు పారిశ్రామికవేత్తలను కలుస్తారని.. తన ఐదేళ్ల కాలంలో అదానీని కలిశాను.. విద్యుత్ ఒప్పందాలకు ముడిపెట్టి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని.. వాళ్లపై పరువు నష్టం దావా వేస్తానని జగన్ తెలిపారు. వాస్తవాలు వక్రీకరించి పదే పదే అబద్ధాలు రాస్తున్నాయని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలోనే ఆ కేసులో తన పేరు ఎక్కడా లేకున్నా రెండు మీడియా సంస్థలూ తన పరువు ప్రతిష్టలు దెబ్బ తీసేలా అబద్దాలతో ప్రచారం చేస్తున్నాయని.. వాటికి లీగల్ నోటీసులు పంపిస్తానని.. 48 గంటల్లో క్షమాపణలు చెప్పకపోతే రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని జగన్ హెచ్చరించారు.

Tags:    

Similar News