డాక్టర్ ని నమ్మిన జగన్

వైసీపీకి ఉత్తరాంధ్రాలో కొత్త తరం రాజకీయం అవసరం అవుతోంది. కానీ వైసీపీకి దొరికిన వారు అలా నిలదొక్కుకున్న వారూ తక్కువే అని చెప్పాలి.

Update: 2024-10-04 04:00 GMT

వైసీపీకి ఉత్తరాంధ్రాలో కొత్త తరం రాజకీయం అవసరం అవుతోంది. కానీ వైసీపీకి దొరికిన వారు అలా నిలదొక్కుకున్న వారూ తక్కువే అని చెప్పాలి. ఆ విధంగా చూస్తే వైసీపీకి జగన్ డిస్కవరీగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి డాక్టర్ సీదరి అప్పలరాజు దొరికారు. ఆయన 2018లో జగన్ పాదయాత్రలో అడుగులో అడుగు వేశారు. ఆ విధంగా ఆయన వైసీపీ టికెట్ ని 2019 ఎన్నికల్లో సంపాదించారు. ఆయన రాజకీయంగా ప్రతిష్ట కలిగిన గౌతు కుటుంబాన్ని ఓడించారు. ఆ వెంటనే జగన్ మంత్రిని చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో అయితే కింజరాపు లేకపోతే ధర్మాన కుటుంబాలే రాజకీయం చేస్తూ దశాబ్దాలుగా శాసీస్తున్న చోట సీదరిని నిలబెట్టారు జగన్. ఆయన కూడా పార్టీ ఓడినా జగన్ పట్ల విధేయుడిగా ఉంటున్నారు. ఒక దశలో ఆయనకు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారని కూడా ప్రచారం సాగింది.

అయితే ఇపుడున్న పరిస్థితులలో ధర్మనా కుటుంబం అండ అవసరమని భావించి జగన్ మాజీ ఉప ముఖ్యమంత్రి d కి జిల్లా పగ్గాలు అప్పగించారు. అదే సమయంలో బ్యాలెన్స్ చేస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కి శ్రీకాకుళం పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారు.

ఇక మాజీ మంత్రి సీదరికి వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్ష బాధ్యతలను ఇస్తూ తాజాగా నియామకం చేశారు. దాంతో జగన్ గుడ్ లుక్స్ లో సీదరి ఉన్నారు అన్నది స్పష్టం అయింది రాజకీయంగా యువకుడు అయిన సీదరికి మంచి భవిష్యత్తు ఉందని నమ్మి బీసీ వర్గానికి చెందిన ఆయనకు తగిన ప్రోత్సాహం ఇస్తున్నారు అని అంటున్నారు.

పలాసలో గౌతు కుటుంబాన్ని ఢీ కొట్టాలన్నా అలాగేక్ కింజరాపు కుటుంబం మీద టీడీపీ మీద జిల్లాలో రాజకీయంగా పోరాడాలి అన్నా సీదరి వంటి వారు అవసరమని జగన్ భావిస్తున్నారు అంటున్నారు.

ఇక పార్టీ ఓటమి పాలు అయ్యాక మీడియా ముందుకు వచ్చి గళం విప్పుతున్న నేతగా సీదరి ముందు వరసలో ఉన్నారు. అదే విధంగా పార్టీలో కొత్త ముఖాలు యువ తరాన్ని ప్రోత్సహించాలని జగన్ భావిస్తున్నారు అంటున్నారు.

మరో వైపు చూస్తే శ్రీకాకుళం జిల్లాలో క్రిష్ణ దాస్ కి తోడుగా అటు తమ్మినేని ఇటు సీదరిని పెట్టి టీడీపీకి కంచు కోట అయిన చోట ఫ్యాన్ మళ్ళీ గిర్రున తిరిగేలా జగన్ తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు.

అలాగే పార్టీలో చురుకుగా లేని నేతలు కూడా ఉన్నారు. వారి ప్లేస్ లో కూడా మార్పులు తీసుకుని రావడం ద్వారా పనిమంతులకే పట్టం అన్నది తన విధానంగా జగన్ చెప్పబోతున్నారు. మొత్తానికి సిక్కోలు వైసీపీకి తగిన మందుని అందించే బాధ్యతను తీసుకున్న డాక్టర్ సీదరి ఈ మేరకు సక్సెస్ అవుతారో చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News