జగనే షాక్ తినేలా చిన్నారి చేసిందిగా !

కానీ జగన్ కి ఈ తరహా అభిమానం కూడా ఉంటుందని ఎవరూ అసలు ఊహించలేదు.

Update: 2025-02-18 17:20 GMT

వైఎస్ జగన్ అంటే కొందరికి ఎమోషన్. అలాగే మరికొందరికి అభిమానం. ఆయనలో వైఎస్సార్ ని చూసుకునే వారు ఉన్నారు. జగన్ తో ఉంటే చాలు అనుకునే వారు ఉన్నారు. అయితే వీరందరినీ అంతా ఎపుడూ చూస్తూనే ఉన్నారు. కానీ జగన్ కి ఈ తరహా అభిమానం కూడా ఉంటుందని ఎవరూ అసలు ఊహించలేదు.

ఆ మాటకు వస్తే జగన్ కూడా ఎపుడూ ఊహించి ఉండరు. నిండా అయిదారేళ్ళు లేని ఒక చిన్నారి జగన్ విజయవాడ టూర్ లో చేసిన యాగీ జగన్ వద్దకు వెళ్ళాలని పెట్టిన పేచీ ఆ మీదట ఏడుపుతో జగనన్నా ప్లీజ్ అంటూ బతిమాలు కోవడం ఇవన్నీ కెమెరాలకు చిక్కిన తరువాత జగన్ అంటే పడి ఏడ్చే చిన్నారులు కూడా ఉంటారా అనిపించకమానదు.

జగన్ సైతం ఒక్కసారి షాక్ తినే ఉంటారు. అయినా సరే ఆయన ఈ చిన్నారి అభిమానానికి సంబరపడ్డారు. నిండుగా పరవశించారు. అందుకే తన సెక్యూరిటీని సైతం వారించి మరీ ఆ చిన్నారిని తన వద్దకు పిలిపించుకుని మరీ నుదుటి మీద ముద్దు పెట్టారు. ఇక ఆ చిన్నారి అయితే జగన్ తో ఉంటూ ఎంతగా ఆనందించిందో ది చూసిన కెమెరాలకే తెలియాలి.

ఆ చిన్నారి జగన్ తో సెల్ఫీ తీసుకుంటూ ఈ లోకమే జయించినంత ఫీలింగ్ ని అనుభవించింది. అంతే కాదు జగన్ ఎత్తుకుంటే తాను ఎంతో ఎత్తున ఉన్నాననుకుని మురిసిపోయింది. ఈ సన్నివేశం చూసిన వారు జగన్ కి పడకపోయినా పగవారు అయినా ప్రత్యర్ధులు అయినా జగన్ కి చిన్నారులలో కూడా ఇంతటి అభిమానం ఉందా అని అనుకోవాల్సిందే.

మరో వైపు చూస్తే జగన్ విజయవాడ లోని జిల్లా కారాగారంలో ఉన్న వల్లభనేని వంశీని ములాఖత్ ద్వారా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ వస్తున్నారు అని తెలుసుకుని జనాలు అక్కడ పోగు అయ్యారు. వారంతా జగన్ కోసం తరలివచ్చారు. దాంతో ఆ ప్రాంతం అంతా జన ప్రవావమే అయింది. జగన్ ఇటీవల కాలంలో బయటకు రావడం లేదు.

ఇలా జగన్ ని చూసిన వారు అంతా ఆయనకు జేజేలు పలుకుతూ రెండు చేతులూ ఊపుతూ జై జగన్ నినాదాలు ఇస్తూంటే వైసీపీ అధినేత ముఖంలో నవ్వులు విరబూశాయి. మొత్తానికి జగన్ కి ఉన్న క్రేజ్ అలాగే ఉందని ఈ సన్నివేశాలు నిరూపించాయి.

Tags:    

Similar News