మళ్లీ బెంగళూరుకు జగన్!... ఆ ట్రీట్ మెంట్ కోసమేనా?

అందుకు కారణం.. ఆయన నడుము నొప్పితో ఇబ్బంది పడుతుండటమేనని.. ఆ సమస్యకు చికిత్స బెంగళూరులో తీసుకుంటున్నారని

Update: 2025-02-22 12:24 GMT

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇటీవల గుంటూరు, విజయవాడల్లో జనాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వచ్చిన జనం, ఆ సందర్భంగా ఆయన ప్రసంగాలపై ఆసక్తికర చర్చ జరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో జగన్ మరోసారి బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకు ఇదే కారణమంటూ ఓ ప్రచారం తెరపైకి వచ్చింది.

అవును... ఏపీలో జగన్ జనాల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. ప్రస్తుతం జైల్లో ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా అటు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ.. పోలీసులకు హెచ్చరికలు పంపారు! అనంతరం.. గుంటూరు మిర్చియార్డును జగన్ సందర్శించారు.

ఈ సందర్భంగా మిర్చి రైతుల కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ భద్రతపై తీవ్ర చర్చ నడిచింది. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా జగన్ మరోసారి బెంగళూరు వెళ్లారనే విషయం తెరపైకి వచ్చింది. అందుకు కారణం ఆయన కొంతకాలంగా నడుము నొప్పితో బాధపడుతున్నారని అంటున్నారు.

ఇటీవల విజయవాడ, గుంటూరు పర్యటనల్లో భాగంగా ప్రసంగించిన జగన్.. ఒకింత ఇబ్బంది పడుతున్నట్లుగా కనిపిస్తున్నారనే చర్చ నెట్టింట జరుగుతోంది. అందుకు కారణం.. ఆయన నడుము నొప్పితో ఇబ్బంది పడుతుండటమేనని.. ఆ సమస్యకు చికిత్స బెంగళూరులో తీసుకుంటున్నారని.. అందుకే జగన్ మరోసారి బెంగళూరు వెళ్లారని అంటున్నారు!

ఈ నేపథ్యంలో.. ఏపీలో రాజకీయం ఫుల్ గా వేడెక్కి, కార్యకర్తలు ఫుల్ యాక్టివేట్ అయినట్లు కనిపించిన సమయంలో జగన్ బెంగళూరు వెళ్లడం ఆసక్తిగా మారిందనే చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో.. ఆయన తిరుగు ప్రయాణంపైనా సందిగ్ధత నెలకొందని అంటున్నారు. ప్రచారం జరుగుతున్నట్లు.. ట్రీట్ మెంట్ పూర్తైన తర్వాత వస్తారా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు!

ఏది ఏమైనా... రెండు రోజులు ఏపీ రాజకీయాల్లో ఫుల్ సందడి చేసి, వాతావరణాన్ని వేడెక్కించిన జగన్.. బెంగళూరుకు వెళ్లారని అంటోన్న వేళ.. ఆయన తిరుగు ప్రయాణం ఎప్పుడు అనేది వేచి చూడాలి!

Tags:    

Similar News