జగన్ క్యాబినెట్ మంత్రులు వీరేనా ?

తాజాగా ఆయన ఒక ప్రముఖ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తప్పకుండా రెండవసారి సీఎం గా ప్రమాణం చేస్తాను అని ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించారు.

Update: 2024-05-10 03:15 GMT

జగన్ ఈసారి ఎన్నికల్లో దూకుడుగానే ఉన్నారు. తాను తప్పకుండా గెలిచి తీరుతాను అని కడు నమ్మకంగా ఉన్నారు. తాజాగా ఆయన ఒక ప్రముఖ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తప్పకుండా రెండవసారి సీఎం గా ప్రమాణం చేస్తాను అని ఫుల్ కాన్ఫిడెన్స్ చూపించారు.

తాను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పారు. అంతే కాదు విశాఖలో తన హయాంలో ఐకానిక్ టవర్ నిర్మిస్తామని భారీ ఎత్తున సెక్రటేరియట్ నిర్మిస్తామని అలాగే విశాఖలో ఐకానిక్ స్టేడియం ని కూడా నిర్మిస్తామని చెప్పారు.

ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల ప్రచార సభలలో తమ కొత్త మంత్రులను కూడా ఎన్నుకుంటున్నారు. వారి పేర్లను డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ గా ప్రకటిస్తున్నారు. డైరెక్ట్ గా చూసుకుంటే కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రత్యర్ధిగా పోటీ చేస్తున్న భరత్ ని మంత్రిగా చేస్తామని ఇప్పటికే చాలా సభలలో జగన్ ప్రకటించారు. అలా చూసుకుంటే జగన్ క్యాబినెట్ లో ఆయనదే తొలి మంత్రి పదవి అని చెప్పాలి.

ఇక కోస్తా జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో భాగంగా జగన్ పెన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని బాగా పొగిడారు. ఆయనని మంచి మెజారిటీతో గెలిపించాలని జనాలను కోరారు. మీరు పిన్నెల్లిని గెలిపిస్తే కనుక ఆయనకు ఉన్నతమైన స్థానం ఇచ్చి మీ ముందుకు పంపిస్తామని జగన్ హామీ ఇచ్చారు. దాంతో పిన్నెల్లికి మంత్రి పదవి ఖాయమని అంటున్నారు.

నిజానికి జగన్ తన మంత్రివర్గాన్ని రెండవ విడత విస్తరించినపుడు పిన్నెల్లికి గ్యారంటీ అని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆయన కూడా మనస్తాపం చెందారు. ఇక వైసీపీలో ఆళ్ళ రామక్రిష్ణారెడ్డికి ఒక ప్రామిస్ ఉంది. అది 2019 నుంచి ఉంది. ఆయనకు కాకుండా మంగళగిరిలో టికెట్ ని మురుగుడు లావణ్యకు ఇచ్చారు.

ఆమె గెలుపు కోసం ఆళ్ళ కష్టపడుతున్నారు.ఆయనను ఎమ్మెల్సీగా చేసి మంత్రి పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని ప్రచారంలో ఉంది. అంటే జగన్ కొత్త క్యాబినెట్ లో ఆయన ఒక మంత్రి అన్న మాట. ఇక తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం ఎమ్మెల్యేగా ఉన్న జక్కంపూడి రాజా ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ రాజాను గెలిపించండి అని ప్రజలను కోరారు. రాజాని గెలిపిస్తే మరింత మంచి స్థానంలో కూర్చోబెడతామని జగన్ హామీ ఇచ్చారు. అంటే ఆయన మంత్రి అవడం గ్యారంటీ అని అనుచరులు అంటున్నారు.

రాజాకు కూడా విస్తరణలో మంత్రి పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ దక్కలేదు. ఈసారి జగన్ సీఎం అయితే తొలిసారిలోనే మంత్రి పదవి ఇస్తారని అంటున్నారు. ఇదే రకమైన హామీలు ఈసారి జగన్ చాలా మందికి ఇస్తున్నారు. అంటే జగన్ కొత్త మంత్రివర్గం కూర్పు కూడా మెల్లగా ఎన్నికల ప్రచారంతోనే స్టార్ట్ చేశారు అని అంటున్నారు.

Tags:    

Similar News