ప్రతి అడుగులోనూ చంద్రబాబు మోసం... మళ్లీ తగులుకున్న జగన్!

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ప్రతి అడుగులోనూ చంద్రబాబు మోసం కనిపిస్తోందని జగన్ ఫైరయ్యారు.

Update: 2024-08-13 09:36 GMT

కూటమి అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినా ఇప్పటికీ సూపర్ సిక్స్ హామీలపై కూటమి ప్రభుత్వం నుంచి స్పష్టత కరువవుతున్న పరిస్థితి. దీంతో... మైకందుకున్న ప్రతీసారి కూటమి ప్రభుత్వం పై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ప్రతి అడుగులోనూ చంద్రబాబు మోసం కనిపిస్తోందని జగన్ ఫైరయ్యారు.

అవును... మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఇందులో భాగంగా... చంద్రబాబు ప్రజలకు ఆశ చూపారని, చివరకు ప్రజల్ని మోసం చేస్తున్నాడని అంటూ జగన్ మండిపడ్డారు. నాడు ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ హామీలు నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం సాకులు చూపలేదని అన్నారు.

ఈ సందర్భంగా.. వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ లా భావించిందని.. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ మాటకు కట్టుబడి పనిచేసిందని.. ప్రతీ ఇంటికీ మంచి చేసిందని చెప్పిన జగన్.. ఆ మంచి ఎక్కడికీ పోదని, వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ఆ మంచే వైసీపీకి శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని నొక్కి చెప్పారు.

జగనే ఉండి ఉంటే... రైతు భరోసా అందేదని.. స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లడి తల్లులకు అమ్మ ఒడి అందేదని.. సున్నా వడ్డీ కూడా వచ్చి ఉండేదని.. విద్యాదీవెన కింద ఫీజు రీయింబర్స్ మెంట్, వసతి దీవెన వచ్చేదని జగన్ తెలిపారు. ఇక మత్స్యకార భరోసా, వాహమ మిత్ర, చేనేతలకు నేతన్న నేస్తం ఈసరికే పడి ఉండేవని జగన్ తెలిపారు. ఆగస్టు నెలాఖరులోపల ప్రతీ ఏటా ఇవి వైసీపీ ప్రభుత్వం ఇచ్చేదని గుర్తుచేశారు.

తమ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు అందేవని చెప్పిన జగన్... ఇప్పుడు మాత్రం జన్మభూమి కమిటీల చుట్టూ, టీడీపీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రతి అడుగులోనూ మోసం కనిపిస్తోందని జగన్ విమర్శించారు. ఇక స్కూళ్లలో టోఫెల్ పీరియడ్ తీసేశారని.. ప్రపంచంతో పోటీ పడే చదువులను నిర్వీర్యం చేస్తున్నారని జగన్ దుయ్యబట్టారు.

ఇదే క్రమంలో... విద్యాకానుక పంపిణీ, మధ్యాహ్న భోజనంలో ప్రతీ రోజూ ఉండే మెనూ కూడా అస్తవ్యస్తం అయ్యిందని.. ఇంగ్లిష్ మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి వచ్చిందని ఇదే క్రమంలో... ఆరోగ్య శ్రీ కింద ఒక్కపైసా ఇవ్వడం లేదని.. కేవలం రెడ్ బుక్ పాలన మాత్రమే ఇప్పుడు ఏపీలో నడుస్తోందని.. కక్షలు తీర్చుకునేవారిని ప్రోత్సహించేలా బాబు తీరు ఉందని జగన్ ఫైరయ్యారు. ఈ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

Tags:    

Similar News