కడపను మామకు అప్పగించిన జగన్

అలా ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు.

Update: 2024-08-22 03:22 GMT

కడపలో జగన్ కీలక రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా తన తమ్ముడు అవినాష్ రెడ్డినే నమ్ముకుని రాజకీయం చేసిన జగన్ ఇపుడు కొత్త రూట్ ని వెతికారు. తన సొంత మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని వైఎస్సార్ కడప జిల్లా కొత్త ప్రెసిడెంట్ గా నియమించారు.

రవీంద్రారెడ్డి కాంగ్రెస్ లో మొదట ఉన్నారు. అలా ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1999లో చింతకొమ్మదిన్నె జెడ్పీటీసీగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలిచి కడప తొలి మేయర్‌గా పని చేశాడు. ఇక వైఎస్సార్ మరణానంతరం జగన్ స్థాపించిన వైసీపీలో ఉన్నారు. వైయస్సార్ హయాంలోనే కడప తొలి మేయర్ పనిచేసి కడప రాజకీయాల మీద పట్టు సాధించిన రవీంద్రారెడ్డికి జగన్ కమలాపురం ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు.

అలా ఆయన 2014, 2019లలో రెండు సార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు పార్టీ పరంగా బాధ్యతలు అయితే ఇప్పటిదాకా అప్పగించలేదు. కానీ ఫస్ట్ టైం ఆయనను కడప వైసీపీ ప్రెసిడెంట్ గా జగన్ చేశారు.

వైఎస్ అవినాష్ రెడ్డి కడపలో మొత్తం చూసుకునే వారు. అలాగే సురేష్ బాబు అన్న ఆయనను కడప వైసీపీ ప్రెసిడెంట్ గా చేసింది. ఇపుడు ఆ ప్లేస్ లోకి రవీంద్రనాధ్ రెడ్డి వచ్చారు. అవినాష్ రెడ్డి పూర్తి షాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. అంతే కాదు ఆయన మీద వివేకా హత్య కేసు ఆరోపణల తరువాత దూకుడు తగ్గించారు అని కూడా అంటున్నారు.

మరో వైపు చూస్తే కడపలో ఆల్టరేషన్ పాలిటిక్స్ ని క్రియేట్ చేయాలని కూడా వైసీపీ ఆలోచిస్తోంది. అదే విధంగా మేనమామ రవీంద్రా రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే నమ్మకమైన వారి చేతిలో సొంత జిల్లా ఉంటుందని భావించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కడప జిల్లా పరిషత్తుని కాపాడుకోవడం వైసీపీకి తక్షణ కర్తవ్యంగా మారింది. ఎవరిని నమ్మాలో లేదో తెలియని నేపధ్యంలోనే మేనమామను ముందు పెట్టారు అని అంటున్నారు. ఇక రవీంద్రారెడ్డిని ఈ విధంగా ముందుకు తేవడం వెనక వేరే వ్యూహాలు కూడా ఉన్నాయని అంటున్నారు.

కడప ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన మీద వివేకా హత్య కేసు కత్తి వేలాడుతోంది. ఇది కాస్తా సీరియస్ అయి ఆయన ఇబ్బందులో పడితే రవీంద్రారెడ్డిని కడప ఎంపీగా పంపుతారు అని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సొంత జిల్లాను చక్కబెట్టుకోవడానికి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

అంతే కాదు కమలాపురం నుంచి రవీంద్రారెడ్డిని దూరం పెట్టడం కూడా ఇందులో మరో వ్యూహం అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో అక్కడ కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు అని అంటున్నారు. వైఎస్ కుటుంబంలోనే షర్మిల పోటీ రాజకీయం చేయడంతో కూడా మేనమామను ముందుకు పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు.మొత్తానికి కడపలో జగన్ కదుపుతున్న పావులు మాత్రం రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

Tags:    

Similar News