ఇండియా కూటమిలోకి జగన్ కాంగ్రెస్ బిగ్ ట్విస్ట్ ?
జగన్ ని ఇండియా కూటమిలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సుముఖంగా ఉందని అంటున్నారు.
ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద రాజకీయ భూకంపం లాంటి పరిణామం చోటు చేసుకోబోతుందా అంటే ఢిల్లీలో జరుగుతున్న సన్నివేశాలు అవును అనేలా ఉన్నాయి. జగన్ పట్ల కాంగ్రెస్ పూర్తి సానుకూలతను కనబరుస్తోంది అని అంటున్నారు. జగన్ ని ఇండియా కూటమిలో చేర్చుకోవడానికి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సుముఖంగా ఉందని అంటున్నారు.
దానికి కారణం ఇండియా కూటమిలోని కీలకమైన పార్టీల నుంచి కాంగ్రెస్ కి ఒత్తిడి వస్తోందని అంటున్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ వైసీపీని ఇండియా కూటమిలోకి చేర్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు.
ఆయన జగన్ కి సన్నిహితులు అన్న సంగతి తెలిసిందే. జగన్ 2019లో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినపుడు స్టాలిన్ ముఖ్య అతిధిగా వచ్చారు అని కూడా గుర్తు చేస్తున్నారు. మరో వైపు చూస్తే యూపీకి చెందిన అతి పెద్ద పార్టీ సమాజ్ వాదీ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం జగన్ ని ఇండియా కూటమిలోకి తీసుకుని రావాలని అనుకుంటున్నారు అని అంటున్నారు.
జగన్ ఆధ్వర్యంలో ఇటీవల ఢిల్లీలో జరిగిన వైసీపీ ధర్నాకు అఖిలేష్ యాదవ్ వచ్చిన సంగతిని కూడా ముందుకు తెస్తున్నారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలు కూడా వైసీపీని ఇండియా కూటమిలోకి తీసుకుని రావడం మంచిదని అంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీలో వైసీపీ తమతో కలసి వస్తే కూటమిలోకి చేర్చుకోవాలని ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఎంపీలతో సోనియా గాంధీ పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు అని అంటున్నారు. బుధవారం ఈ సమావేశం జరుగుతుందని అంటున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో ఎలా వ్యవహరించాలి అన్న దానిపైన లోక్ సభ రాజ్యసభ కాంగ్రెస్ ఎంపీలకు సోనియా గాంధీ డైరెక్షన్ ఇస్తారని అంటున్నారు. ఈ సమావేశంలోనే వైసీపీ విషయంలో కాంగ్రెస్ పెద్దల మధ్య ఒక చర్చ సాగుతుందని అంటున్నారు.
ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాలు పంచుకుంటారు అని అంటున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం దేశ రాజకీయాలలో బీజేపీకి దెబ్బ తీసేలా అలాగే ఏపీలో రాజకీయాన్ని మార్చి అక్కడ టీడీపీకి షాక్ ఇచ్చేలా ఉండబోతున్నాయని అంటున్నారు.
వైసీపీని ఇండియా కూటమిలో చేర్చుకోవడం ద్వారా మొత్తం దక్షిణాది మీద కాంగ్రెస్ తన పట్టుని సాధించేందుకు చూస్తుందని అంటున్నారు. మొత్తానికి చాలా వేగంగానే పరిణామాలు మారుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ మీటింగ్ తరువాత సంచలన నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. జగన్ కి కాంగ్రెస్ అగ్రనాయకత్వం టచ్ లోకి వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఇవి కేవలం పుకారుగానే మిగులుతుందా లేక దీని నుంచి రాజకీయ భూకంపం పుడుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.