23 నుంచి విశాఖ సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్...!

ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాక కోసం చకచకా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. ఆయన విశాఖలో వచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 23న జగన్ విశాఖ రానున్నారు.

Update: 2023-10-01 02:45 GMT

ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాక కోసం చకచకా ఏర్పాట్లు సాగిపోతున్నాయి. ఆయన విశాఖలో వచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. అక్టోబర్ 23న జగన్ విశాఖ రానున్నారు. ఆ రోజున కొత్తగా ఏర్పాటు చేస్తున్న సీఎం క్యాంప్ ఆఫీసుని ఆయన ప్రారంభిస్తారు.

దాంతో లాంచనంగా జగన్ విశాఖ నుంచి పాలనకు శ్రీకారం చుట్టినట్లు అవుతుంది అంటున్నారు. ఇదిలా ఉంటే విజయదశమి ఘడియలు ప్రవేశించే రోజు కాబట్టే 23 ను మంచి ముహూర్తంగా ఎంచుకున్నారు అని అంటున్నారు.

విశాఖ టూ భీమిలీ రోడ్డులో ఉన్న రుషికొండ మీద నిర్మించిన అత్యాధునిక భవనాలలో ఒక భవనాన్ని సీఎం క్యాంప్ ఆఫీసు కోసం వాడుకుంటారు అని అంటున్నారు. దాంతో తాడేపల్లి నుంచి రుషికొండకు నేరుగా సీఎం జగన్ ల్యాండ్ అవుతారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే విశాఖలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్ ఐటీ డెవలప్ మెంట్ సెంటర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్టోబరు 16న ఘనంగా ప్రారంభించనున్నారు. విశాఖకు తన మకాం కంటే ముందు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడానికి సంకేతంగా జగన్ ఇన్ఫోసిస్ ని ఓపెన్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారని అంటున్నారు.

ఇక విశాఖ ఇన్ఫోసిస్ కేంద్రంలో మొదటి దశలో 650 మందితో కార్యకలాపాలు నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఆ సంఖ్యను అతి తొందరలోనే వేయి మంది దాకా సేవలు విస్తరించనున్నారని చెబుతున్నారు. ఇక టైర్ టూ సిటీస్ ఓ తన ఐటీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్న ఇన్ఫోసిస్ విశాఖ నుంచి సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్, ఐటీ అనుబంధ సేవలు, ఎంటర్ ప్రైజ్ అప్లికేషన్స్ తదితర సేవలు అందించాలని భావిస్తోంది అంటున్నారు.

మరో వైపు ఇన్ఫోసిస్ అధికారులు విశాఖలో ఐటీ మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ అయి డేటా సెంటర్ ని సీఎం ప్రారంభించే దాని గురించి చర్చించారు. రానున్న కాలంలో మరిన్ని ఐటీ సెంటర్లు విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్నాయని మంత్రి అంటున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి విశాఖ మకాం సందర్భంగా శుభారంభంగా ఇన్ఫోసిస్ డేటా సెంటర్ కి శ్రీకారం అని చెబుతున్నారు.

Tags:    

Similar News