భారీ ర్యాలీ... జగన్‌ కు జై కొట్టిన ఎన్టీఆర్ – ప్రభాస్ ఫ్యాన్స్!

అవును... ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థావన ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటుంటుంది

Update: 2024-05-09 11:23 GMT

ఎవరు అవునన్నా కాదన్నా.. రాజకీయాల్లో సినీనటుల ప్రభావం, సినీనటుల కెరీర్ వృద్ధిలో ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తల ప్రభావం విడదీయరానిదనే చెప్పుకోవాలి! అయితే ఇది అందరి నటులకు సూటవ్వదు.. కొందరికి వద్దనుకున్నా వదిలిపెట్టదు.. వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు! తాను రాజకీయాలకు దూరం అని ఆయన ఎంత చెప్పినా... రాజకీయాలు మాత్రం ఆయన నుంచి దూరం కావడం లేదు.. కావు కూడా! కారణం... చాలా మందికి జూనియర్ ఎన్టీఆర్ అంటే... ఈ జనరేషన్ ఎన్టీఆర్!!

అవును... ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్థావన ఏదో ఒక మూల వినిపిస్తూనే ఉంటుంటుంది. వాస్తవానికి 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తరువాత ఆయన ప్రస్థావన మరింత ఎక్కువగా వినిపించింది. ఒకానొక సమయంలో... పార్టీ పగ్గాలు జూనియర్ కి అప్పగించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. ఆ పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం జూనియర్ ఎన్టీఆర్ కి పార్టీ బాధ్యతలు అప్పగించాలని, అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుందని సలహా ఇచ్చారు.

అయితే చంద్రబాబు మాత్రం నారా లోకేష్ పార్టీకి భవిష్యత్తు నాయకుడు అని తేల్చేశారు. ఇదే సమయంలో పార్టీలో వీలైనంత వరకూ జూనియర్ ప్రస్థావన రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలను అభిమానులు ప్రదర్శిస్తూనే ఉంటారు. ఇక ఇటీవల జరిగిన కొడాలి నాని నామినేషన్ రోజు సంగతైతే చెప్పే పనే లేదు. జగన్, కొడాలి నాని ఫ్లెక్సీలతో పాటు ప్రతీ ఫోటోలోనూ జూనియర్ కనిపించారు!

ఇందులో భాగంగానే... గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానికి మద్దతుగా జూ. ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు.. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫొటోలతో పాటి జగన్ జెండాలు, ఫ్లెక్సీలు చేతపట్టి కొడాలి నాని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే క్రమంలో తాజాగా కర్నూల్ లో జరిగిన బహిరంగ సభలో ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫొటో ఉన్న జెండాలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదే క్రమంలో... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల సైతం సీఎం జగన్ సభలో సందడి చేశారు. జగన్ – ప్రభాస్ ఫొటోలతో ఉన్న జెండాలతో సభకు వచ్చి.. వైసీపీకి మద్దతుగా, జగన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో... మెజార్టీ ఎన్టీఆర్ అభిమానులు వైసీపీకే మద్దతు తెలుపుతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ చర్చ నెట్టింట వైరల్ గా మారింది. దీంతో.. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ – ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు వైసీపీకే అనే కామెంట్లు పెరిగిపోతున్నాయి!

Full View
Tags:    

Similar News