"జగన్ కొంతకాలం పాటు నోరు తెరవకపోవడమే మంచిది"!

ఏపీలో కూటమి నేతలు, ప్రధానంగా మంత్రులు.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పేరు చెబితే అంతెత్తున లేస్తున్నారు

Update: 2024-08-21 04:39 GMT

ఏపీలో కూటమి నేతలు, ప్రధానంగా మంత్రులు.. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పేరు చెబితే అంతెత్తున లేస్తున్నారు. నాడు జగన్ చేసిన పనుల వల్ల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి తమకు సమయం సరిపోవడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ ని అమంత్రి గొట్టిపాటి రవికుమార్ గట్టిగా తగులుకున్నారు.

అవును... ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైరయ్యారు. జగన్ వంటి అసమర్థుడి కారణంగా ఎదురైన ఇబ్బందులను, దెబ్బలను సర్ధుబాటు చేయడానికే తమకు సమయం సరిపోవడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో... కొంతకాలం పాటు జగన్ నోరు తెరవకపోవడమే మంచిదని సూచించారు.

తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు విషయంలో జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తమ ప్రభుత్వ హయాంలో రెండు టన్నెళ్లను పూర్తి చేశామని.. మిగిలిన అరకొర పనులు పూర్తి చేసేందుకు చంద్రబాబుకు మనసు రావడం లేదని విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి గొట్టిపాటి స్పందించారు.

ఇందులో భాగంగా... గతంలో చంద్రబాబు సూచనల మేరకు ప్రకాశం జిల్లా నేతలు కలిసి ఢిల్లీ వెళ్లామని.. వెలిగొండ ప్రాజెక్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలని కోరామని.. కానీ, ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి ప్రాజెక్టును అడ్డుకున్నారని దుబ్బయట్టారు.

అసలు ఈ వెలిగొండ ప్రాజెక్ట్ కు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నదే నాడు సీఎంగా ఉన్న జగన్ అని నిప్పులు చెరిగారు. గతంలో చేసిన పనులు మరిచిపోయి ఇప్పుడు నీతులు చెబుతున్నరని.. ఒక్క వెలిగొండ ప్రాజెక్టే కాదు.. గుండ్లకమ్మ ప్రాజెక్టును కూడా నాశనం చేశారని గొట్టిపాటి ఫైరయ్యారు.

ఈ ప్రాజెక్ట్ గేటు కొట్టుకుపోయి మూడేళ్లైనా.. జగన్ కనీసం సమీక్ష కూడా చేయలేదని.. గేటును తిరిగి ఏర్పాటు చేసే ఆలోచనా చేయలేదని విమర్శించారు. ఇదే క్రమంలో వైసీపీ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని అన్నారు. అదేవిధంగా పులిచింతల గేటు కొట్టుకుపోయినా కూడా ఇదే వైఖరి అవలంభించారని గొట్టిపాటి వితౌట్ గ్యాప్ విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News