అద్దంకిలో జ‌గ‌న్‌ అస్త్ర స‌న్యాసం...' గొట్టిపాటి బుజ్జి' మెజార్టీ మీదే లెక్క‌లు..!

ఇప్పటికే ఆరు జాబితాలలో పార్టీ అభ్యర్థులను ప్రకటించిన జగన్ కొన్నిచోట్ల మరీ బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతుండడంతో ఆయా నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటుంది.

Update: 2024-02-06 06:14 GMT

వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి లెక్కలు తారుమారు అవుతున్నాయి. రివర్స్‌లో వెనక్కి వస్తున్నాయి. ఇప్పటికే ఆరు జాబితాలలో పార్టీ అభ్యర్థులను ప్రకటించిన జగన్ కొన్నిచోట్ల మరీ బలహీనమైన అభ్యర్థులను నిలబెడుతుండడంతో ఆయా నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్ తలలు పట్టుకుంటుంది. మైలవరంలో జడ్పిటిసిగా ఉన్న తిరుపతిరావు యాదవ్ కు ఎందుకు ? టిక్కెట్టు ఇచ్చారో అర్థంకాక అక్కడ కేడర్ తలలు బాదుకుంటుంది. ఇక ఉమ్మ‌డి ప్రకాశం జిల్లాలోని అద్దంకిలో పాణెం హనిమిరెడ్డికి సీటు ఇవ్వడం పెద్ద రాంగ్ స్టెప్ అని రాష్ట్ర మొత్తం చర్చ జరుగుతుంది.

అద్దంకిలో గత మూడు ఎన్నికలలోను టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వరుస విజయాలు సాధిస్తున్నారు. గత మూడు ఎన్నికల్లోను ఏ పార్టీలో ఉన్న గొట్టిపాటి రవికుమార్ దే గెలుపు. 2009లో కాంగ్రెస్ - 2014లో వైసిపి - 2019లో టిడిపి నుంచి ఆయన వరుస విజయాలు సాధిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేని ఇమేజ్ గొట్టిపాటి సొంతం. గత ఎన్నికల్లో టిడిపి కేవలం 23 సీట్లకు పరిమితం అయినా అద్దంకిలో రవికుమార్ ఏకంగా 14 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించారు. అలాంటి చోట ఆర్థికంగా సామాజిక సమీకరణలపరంగా, స్థానికత పరంగా బలమైన అభ్యర్థిని నిలపలేని దుస్థితితో వైసిపి అధిష్టానం ఉంది.

గత ఎన్నికల్లో ఓడిన సీనియర్ నేత బాచిన చెంచు గర‌టయ్య స్థానంలో ఆయన కుమారుడు బాచిన‌ కృష్ణ చైతన్యకు నియోజకవర్గం పగ్గాలు అప్పగించారు. నాలుగేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం ఆయన తనవంతుగా కష్టపడ్డారు. అద్దంకి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం ఎక్కువ. గొట్టిపాటిని ఢీకొట్టాలి అంటే క‌మ్మ‌ సామాజిక వర్గంలో ఆర్థిక, అంగ బలాలు పుష్కలంగా ఉన్న వ్యక్తులకు సీటు ఇస్తే సరిపోతుంది. పైగా ఇది జగన్ బాబాయ్ వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డికి సొంత నియోజకవర్గం. ఇక్కడ వైసిపి విజయం సాధించడం సుబ్బారెడ్డి కి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. అలాంటి చోట ఎక్కడో పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన వ్యక్తి హ‌నిమిరెడ్డికి ఇన్చార్జి పగ్గాలు అప్పగించారు.

అసలు నియోజకవర్గానికి హ‌నిమిరెడ్డికి అస్సలు సంబంధం లేదు. పైన ఆయన రాజకీయాలకు కూడా కొత్త.. అలాంటిది అద్దంకిలో చాలా బలంగా ఉన్న గొట్టిపాటి రవికుమార్‌ను ఢీకొట్టటం హ‌నిమిరెడ్డికి ఎంత మాత్రం సాధ్యం కాదు. ఆయనకు ఇన్చార్జ్ ప‌గ్గాలు ఇచ్చిన వెంటనే నియోజకవర్గంలో వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. ఇప్పటివరకు పార్టీ కోసం కష్టపడుతున్న మాజీ ఇన్చార్జి కృష్ణ చైతన్య వర్గం సహకరించడం లేదు. దీనికి తోడు నియోజకవర్గంలో ఎంతో కొంత ప్రభావం చూపే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయులు సైతం హ‌నిమిరెడ్డికి దూరంగా పరోక్షంగా బుజ్జికి సహకరిస్తున్నారు.

క‌మ్మేత‌ర ఓట్ల‌ను ఏకంగా చేసి గెలుస్తాం అని జ‌గ‌న్ లెక్క‌లు వేసుకుంటున్నా... ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే రెడ్ల‌లోనే స‌గం మంది గొట్టిపాటి బుజ్జి వైపు ఉన్నారు. ఇక జ‌గ‌న్ ఇక్క‌డ అయితే బాచిన వాళ్లు లేదా క‌ర‌ణం వాళ్ల‌లో ఎవ‌రో ఒక‌రికి సీటు ఇస్తే పోటీ ఉండేది. వీళ్లిద్ద‌రిని త‌ప్పించ‌డంతో వైసీపీ వైపు ఉన్న క‌మ్మ‌లు కూడా మెజార్టీ బుజ్జి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక మిగిలిన బీసీ, ఇత‌ర కులాల్లోనూ బుజ్జికి ప‌ట్టుంది. ఓవ‌రాల్‌గా చూస్తే అద్దంకిలో ఎన్నిక‌ల‌కు ముందే జ‌గ‌న్ త‌మ పార్టీ నేత హ‌నిమిరెడ్డితో అస్త్ర‌స‌న్యాసం చేయిస్తే.. గొట్టిపాటి బుజ్జి మెజార్టీ ఎంత‌న్న‌దానిమీదే ఓవ‌రాల్‌గా చ‌ర్చ న‌డుస్తోంది.




 


Tags:    

Similar News