లోక్ సభలో మోడీ సర్కార్ కి షాకిచ్చిన జగన్ ఎంపీలు!

దీంతో... ఏపీలో 25 ఎంపీల బలమూ కేంద్రంలో ఎన్డీయేకు ఉందనే కామెంట్లు వినిపించేవి. ఈ సమయంలో.. లోక్ సభలో వైసీపీ, మోడీకి షాక్ ఇచ్చింది.

Update: 2024-08-08 13:00 GMT

ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ తో చాలా సన్నిహిత సంబంధాలున్నాయనే కామెంట్లు వినిపించేవి. అయితే... అది పూర్తిగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలే తప్ప.. ఎన్డీయే కూటమితో వైసీపీ ఎలాంటి రాజకీయ సంబంధం లేదని ఆ పార్టీ నేతలు చెప్పేవారు. మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన బిల్లులకు మాగ్జిమం మద్దతు పలికేవారు!!

దీంతో... అప్పటి నుంచీ జగన్ ను మోడీకి రహస్య స్నేహితుడిగా రాజకీయ వర్గాల్లో కామెంట్లు చేసేవారు. ఇప్పుడు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్.. కేంద్రంలో మోడీకి సపోర్ట్ గా నిలుస్తున్నారనే మాటలూ వినిపించాయి. దీంతో... ఏపీలో 25 ఎంపీల బలమూ కేంద్రంలో ఎన్డీయేకు ఉందనే కామెంట్లు వినిపించేవి. ఈ సమయంలో.. లోక్ సభలో వైసీపీ, మోడీకి షాక్ ఇచ్చింది.

అవును... ఈ రోజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్ సభలో కేంద్రమంత్రి కిరణ్ రిజుజు వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే... ఈ బిల్లును వైసీపీ ఎంపీలు నిర్ధ్వందంగా వ్యతిరేకించారు! ఈ సందర్భంగా... బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు కచ్చితంగా ముస్లింల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది!

ఇదే సమయంలో... ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లింల అభిప్రాయాలను తీసుకోవాలని చెబుతూ... ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయలతోనూ ఏకీభవిస్తున్నట్లు వైసీపీ వెల్లడించింది. దీంతో... మోడీ సర్కార్ ప్రవేశపెట్టే బిల్లులకు వైసీపీ మద్దతు తెలపకుండా వ్యతిరేకించడం కచ్చితంగా రాజకీయంగా చర్చనీయంశమే అనే చర్చ మొదలైంది.

ఇక... ఈ బిల్లును వైసీపీతో పాటు కాంగ్రెస్, తృణముల్ కాంగ్రెస్, మజ్లిస్, కమ్యునిస్టు పార్టీలూ వ్యతిరేకించగా.. టీడీపీ, జేడీయు, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు తెలిపాయి.

కాగా... ఈ వక్ఫ్ బిల్లుపై స్పందించిన ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇందులో భాగంగా.. వక్ఫ్ బిల్లుతో మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని.. ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే బిల్లని తెలిపారు. ఇదే సమయంలో... ఆర్టికల్ 25 కి భంగం కలిగేలా ఈ బిల్లు ఉందని అన్నారు. అదేవిధంగా... వక్ఫ్ ఆస్తులు మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఉన్నాయని స్పష్టం చేశారు!

ఈ నేపథ్యంలోనే... అల్లా పేరు మీద ఆస్తిని విరాళంగా ఇచ్చే అవకాశం లేకుండా చేశారని.. దర్గా, మసీదుల ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే... ఈ బిల్లుపై ముస్లింల అభిప్రయాలు పరిగణలోకి తీసుకోవాలంటూ ఒవైసీ వ్యాఖ్యలతో ఏకీ భవించిన వైసీపీ.. ఈ బిల్లును వ్యతిరేకించింది. దీంతో... మోడీతో విభేదిస్తున్నట్లు కాకపోయినా, అనుకూలిస్తున్నట్లు మాత్రం లేమనే హింట్ ఇచ్చారనే కామెంట్లు మొదలయ్యాయి!

Tags:    

Similar News