ఒక్క దెబ్బకు.. రెండు వ్యూహాలు సక్సెస్.. దటీజ్ జగన్.. !
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా చేసిన అంతర్గత మార్పులు.. జగన్ వ్యూహానికి బలాన్ని చేకూరుస్తు న్నాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాజాగా చేసిన అంతర్గత మార్పులు.. జగన్ వ్యూహానికి బలాన్ని చేకూరుస్తు న్నాయి. ప్రధానంగా.. ఇటీవల కాలంలో భారీ ఎత్తున వివాదాస్పదం అయిన.. ఉమ్మడి శ్రీకాకుళానికి చెం దిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై తాజాగా జగన్ స్పందించారు. ఆయనపై చర్యలు తీసుకో వాలని వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఎట్టకేలకు జగన్ రియాక్ట్ అయ్యారు. దువ్వాడ సతీమణి, బిడ్డలు ఉండగానే..వేరే మహిళతో ఉంటున్న వ్యవహారం రాజకీయంగా దుమారం రేపింది.
దీంతో దువ్వాణ సతీమణి వాణి..తన భర్తను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీనికి మరికొందరు వైసీపీ నాయకులు కూడా మద్దతు తెలిపారు. వీరిలో దువ్వాడను వ్యతిరేకించే వర్గం కూడా ఉంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లు వేచి చూసిన జగన్.. చివరకు తప్పని పరిస్థితిలో వ్యూహాత్మకంగా చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి ఇలాంటి ఆరోపణలువ చ్చినప్పుడు.. సహజంగానే పార్టీ నుంచి సస్పెండ్ చేయడమో.. లేక.. ఎమ్మెల్సీ పదవి నుంచి రాజీనామా చేయించడమో చేస్తారు.
కానీ, జగన్ మాత్రం కర్ర విరక్కుండా.. పాము చావకుండా.. సంచనల నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు దువ్వాడపై చర్యలు తీసుకున్నట్టు కనిపిస్తూనే.. మరోవైపు పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టారు. ఇదేసమయంలో దువ్వాడను కొట్టకుండా.. కేవలం గిచ్చి వదిలి పెట్టారు. అంటే.. ఆయనకు పెద్దగా నొప్పిలేని వ్యవహారంతోపాటు.. పెద్ద బరువును కూడా దింపేశారు. ఆయన అధికారానికి వచ్చిన ఇబ్బంది లేకుండా జగన్ నిర్ణయం ఉండడం గమనార్హం.
టెక్కలి నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఉన్న దువ్వాడను పక్కన పెట్టారు. ఇది పోయినంత మాత్రాన దువ్వాడ కు పోయేదేం లేదు. ఎలానూ ఎమ్మెల్సీ ఉంది. సో.. ఆయనపై పెద్ద ప్రభావం అయితే ఉండదు. ఇక, ఇదేసమయంలో తనకు ప్రాధాన్యం లేకుండా పోయిందని వగరుస్తున్న పేరాడ తిలక్‌ను తీసుకువచ్చి టెక్కలి ఇంచార్జ్ చేశారు. దీనివల్ల పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టేశారు. అంటే.. మొత్తంగా ఈ మార్పుల ద్వారా.. దువ్వాడపై చర్యలు తీసుకున్నామన్న సంకేతాలు ఇస్తూనే.. మరోవైపు పేరాడకు ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కూడా ప్రచారం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. సో.. ఇదీ.. జగన్ వ్యూహం.