విశాఖ నుంచే పాలన.. మరోసారి చెప్పేసిన జగన్!
ప్రస్తుతం విశాఖలో బస్సు యాత్ర చేస్తున్న జగన్.. వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌తో భేటీ అయ్యారు.
వైసీపీ అధినేత జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని చెప్పారు. ``పాలన ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి పాలన ప్రారంభమైతే.. అన్ని విధాలా నగరం రూపు రేఖలు మారిపోతాయి. ఐటీలో కూడా.. నగరాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలతో పోటీ పడేలా చేస్తాం`` అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం విశాఖలో బస్సు యాత్ర చేస్తున్న జగన్.. వైసీపీ సోషల్ మీడియా వారియర్స్‌తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న వారి సమస్యలు పరిష్కరించేం దుకు ప్రత్యేకంగా ఒక యాప్‌తీసుకురానున్నట్టు చెప్పారు. దీని ద్వారా ఫిర్యాదులు తీసుకుని.. వాటిని సైబ ర్ క్రైమ్‌కు పంపించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తాను ప్రస్తుత ఎన్నికల్లో ఒంటరిగా యుద్ధం చేస్తున్నా నని చెప్పారు. అటు వైపు.. చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ కూటమిగా కట్టగట్టుకుని వస్తున్నాయని.. అయినా తనకు ఎలాంటి భయం లేదన్నారు.
ఎన్నికల్లో ప్రజలు తమవైపే ఉన్నారని జగన్ చెప్పారు. విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని చె ప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు.. ప్రజలకు అందుతున్న మేళ్లు... తనను గెలి పిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ తనకు అండగా ఉన్నారని చెప్పిన జగన్.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా... వాటిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. సోషల్ మీడియా కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు తమ సమస్యలు చెప్పుకొన్నారు.