వైసీపీ ఎమ్మెల్యేకు జగన్ మార్క్ షాక్ ట్రీట్మెంట్...!

అందుకే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా వారు పార్టీ మారకముంద అక్కడ ఇంచార్జిని ప్రకటించేస్తున్నారు. ఇపుడు ఆ వంతు మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ కి వచ్చింది.

Update: 2024-02-02 16:20 GMT

జింక ముందు ఫ్లూట్ ఊదు సింహం ముందు కాదు అని బాలయ్య పాపులర్ డైలాగ్ ఉంది. వైసీపీ అధినేత జగన్ అంటేనే ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా ఉంటారు. ఆయన మనుషులను చదివేస్తారు. పైగా పాలిటిక్స్ అంటేనే లాయల్టీకి భిన్నం అని పిన్న వయసులోనే తెలుసుకున్నారు. పదవుల కోసం వచ్చిన వారు పై పై ప్రేమలు అభిమానాలు చూపిస్తారు అన్నది విధితమే.

అలాంటి వారికి కీలెరిగి వాత పెట్టడంలో జగన్ స్పెషలిస్ట్ అని అంటున్నారు. ఆయన తన వద్ద ఉన్న 150 ఎమ్మెల్యేలలో ఎవరెటు అని చాలా కాలం క్రితమే లిస్ట్ ముందు పెట్టుకుని టిక్కు పెట్టుకున్నారని చెబుతారు. అందుకే వారికి టికెట్ ఇవ్వకుండా చేయడమో ప్లేస్ మార్చడమో చేస్తున్నారు అని అంటున్నారు. అపుడు వారే బయటపడి పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు.

ఇక వారి కదలికలు ఎపుడైతే అనుమానంగా ఉన్నాయే వారికే ఏ మాత్రం చాన్స్ ఇవ్వకుండా అక్కడ ఆల్టరేషన్ లీడర్ షిప్ ని కూడా డెవలప్ చేసి ఉంచుతున్నారు. అందుకే షాక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా వారు పార్టీ మారకముంద అక్కడ ఇంచార్జిని ప్రకటించేస్తున్నారు. ఇపుడు ఆ వంతు మైలవరం ఎమ్మెల్యే వసంత క్రిష్ణ ప్రసాద్ కి వచ్చింది.

ఆయనకు మైలవరం టికెట్ ని వైసీపీ హై కమాండ్ ఇవ్వాలని అనుకోవడం లేదు అన్నది చాలా కాలంగా వినిపిస్తున్న వార్తలు. ఇక వసంత క్రిష్ణ ప్రసాద్ రెండేళ్ల క్రితం మంత్రి వర్గ విస్తరణ వేళ చేసిన కొన్ని కామెంట్స్ ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కార్తీక సమారాధన లో వైసీపీ హై కమాండ్ ని నేరుగా టార్గెట్ చేసి అన్న మాటలు పార్టీ అధినాయకత్వానికి ఇప్పటికీ గుర్తు ఉన్నాయని అంటున్నారు.

అందుకే అన్నీ సరి చూసుకునే సరైన టైం లో వైసీపీ డెసిషన్ తీసుకుంటోందని చెబుతున్నారు. మైలవరం నియోజకవర్గం ఇంచార్జిగా వసంత ప్లేస్ లో జెడ్పీటీసీ తిరుపతిరావుని జగన్ దాదాపుగా ఖరారు చేశారు అని అంటున్నారు. ఈ మేరకు ఆయన్ని తన దగ్గరకు రప్పించుకుని మరీ జగన్ ఆయనకు టికెట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక జగన్ ని కలసి తిరుపతిరావు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్పడం కూడా చర్చకు దారి తీస్తోంది.ఇక ఫిబ్రవరి 3వ తేదీన ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ సిద్ధం సభ సాగుతోంది. దానికి వసంత దూరంగా ఉంటున్నారు. ఆయన ఇప్పటికే టీడీపీ పెద్దలకు టచ్ లోకి వెళ్లారని తొందరలో చేరుతారు అని అంటున్నారు.

ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వైసీపీ హై కమాండ్ కూడా తమ వైపు నుంచి పావులు కదిపి వసంతకు అలా చెక్ పెట్టేసింది అని అంటున్నారు. ఇపుడు వసంత నిర్ణయమే వెలువడాల్సి ఉంది. ఆయన టీడీపీ కండువా కప్పుకుంటే ఆ లాంచనమూ పూర్తి అవుతుంది. జగన్ దగ్గర బేరాలు ఉండవని పార్టీ వారే చెబుతారు.

పైగా ఆయన వద్ద ఒక్కో ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటుందని అంటారు. అది అయిదేళ్ళకు సరిపడా ఎక్కువ పేజీలతోనే ఉంటుందని అంటారు. ఎన్నికల ముందు హడావిడి చేసినా గతంలో వారి యాక్టివిటీ వారు అప్పట్లో చేసిన కామెంట్స్ వారు ఎవరితో తిరుగుతున్నారు ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకునే వైసీపీ తనదైన యాక్షన్ లోకి దిగుతోంది అని అంటున్నారు. మొత్తానికి రోగి అదే కోరాడు వైద్యుడు అదే ఇచ్చారు అన్నట్లుగా వసంత వైసీపీలో ఉండ దలచుకోలేదు, వైసీపీ కూడా ఉండకూడదు అనుకుంటోంది. చివరికి అలా సెట్ అయింది అని అంటున్నారు.


Tags:    

Similar News