బాబు విలువ తెలియ చెప్పిన జగన్ ?

ఈ మధ్యలో జగన్ అయిదేళ్ల పాలన పుణ్యమాని బాబు గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది.

Update: 2024-07-03 13:50 GMT

ఏ అమరావతి అయితే చంద్రబాబును 2019 ఎన్నికల్లో ఓడించిందో అదే అమరావతి బాబు నాయకత్వంలోని టీడీపీ కూటమిని 164 సీట్లతో అద్భుతమైన విజయంతో సీఎం సీట్లో కూర్చోబెట్టింది. ఈ మధ్యలో జగన్ అయిదేళ్ల పాలన పుణ్యమాని బాబు గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. బాబు ఇపుడు ఆపద్భాంధవుడు గా కనిపిస్తున్నారు.

బాబు అమరావతి అని 2019కి ముందు చెబితే గ్రాఫిక్స్ అనుకునే బాపతు ఉండేవారు. ఇపుడు బాబు వైపే వారంతా ఆశగా చూస్తున్నారు. బాబును గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని కూడా అంటున్నారు. బాబు మాత్రమే అమరావతి వంటి రాజధానిని నిర్మించగలరని ఏకమొత్తంగా ఏపీ జనాలు అంతా నమ్ముతున్నారు.

ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని మీద శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబుని మీడియా అనేక ప్రశ్నలు వేసింది. అందులో ఒకటి ఏంటి అంటే ఇంత పెద్ద ఎత్తున ఖర్చుతో కూడిన అమరావతి రాజధానిని మీరు తలకెత్తుకున్నారు. అది సాధ్యమేనా అన్నది కూడా మీడియా నుంచి వచ్చింది.

దానికి బాబు చెప్పిన సమాధానం అయిదు కోట్ల మందికి నచ్చేదిగా మెచ్చేదిగా ఉంది. కష్టం అనుకుని వదిలేయను, ప్రజలు నన్ను నమ్మి కదా ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము కానీయను అని బాబు అన్నారు. నాకు తలకు మించిన భారం అయినా ప్రజలతోనే మీ ద్వారా ఆ కష్టాన్ని పంచుకుంటాను. అయినా సరే అమరావతి రాజధానిని వదిలిపెట్టేది లేదు అని బాబు ఖండితంగా చెప్పారు.

Read more!

ఏపీలో ఖజానా ఖాళీగా ఉంది. అయినా సరే దీన్ని సవాల్ గా తీసుకుంటామని బాబు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం బృహత్తరమైన బాధ్యత ఆ దిశగా తాను ఏమి చేయాలన్నది చేస్తాను అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే బాబు అమరావతి అయిదేళ్లలో ఎలా పాడుపెట్టిందీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందరికీ చూపించారు.

బాబు ఆనాడు ప్రారంభించిన నిర్మాణాలు ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా ఉన్నాయి. దాంతో మళ్లీ తాను అక్కడ నుంచే పనులు మొదలు పెడతాను అని బాబు భరోసా ఇచ్చారు. ఇక అమరావతి రాజధాని అన్నది ఏపీ ప్రజల సెంటిమెంట్ గా ఉంది. దాన్నే పట్టుకుని మీడియా కూడా బాబుని ప్రశ్నించింది. మీరు అయిదేళ్ల పాటు అమరావతిలో నిర్మాణాలు చేస్తారు. ఆ తరువాత మళ్లీ ఎవరో వచ్చి కడపలోనో శ్రీకాకుళంలోనో రాజధాని అంటే ఏమి చేస్తారు అని కూడా మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

ఇది ఏపీ మొత్తం ప్రజలలో ఉన్న డౌటే. దానికి బాబు బదులిస్తూ అలా కాకుండా లీగల్ గా ఏమి చేయాలో అన్నీ చేస్తామని అన్నారు. ఇక్కడే బాబు విజయం మరోసారి ఖాయం అయిందని అంటున్నారు. అదెలా అంటే అమరావతిని బాబు అయిదేళ్ళలో ఒక రూపూ షేపూ తెచ్చినా ఆయనే 2029 ఎన్నికల్లో సీఎం. అలా కాకుండా నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నా కూడా బాబునే మళ్ళీ జనాలు గెలిపిస్తారు. ఎందుకంటే మధ్యలో మరో పార్టీ గెలిచి వస్తే ఏమి జరిగింది అన్నది 2019 నుంచి 2024 దాకా జనాలు కళ్లారా చూశారు. కాబట్టి అమరావతే బాబుకు రాచబాట అని అంటున్నారు.

పైగా జగన్ ఈ మధ్యలో గెలవడం అన్నది కూడా బాబుకు మరింత ప్లస్ అయింది అని అంటున్నారు. బాబు కాకుండా ఏపీని ఇపుడున్న పరిస్థితుల్లో ఎవరూ బాగు చేయలేరు అన్నది ఎంతో స్పష్టంగా తెలిసి వచ్చిందని అంటున్నారు. ఇపుడు జనాల్లో బాబు మాటలకు ఎంతో విలువ ఉంది. ఆయన గ్రాఫ్ వేయింతలు పెరిగింది. అదెలాంటిది అంటే బాబు జీవించి ఉన్నంతవరకూ ఆయనే సీఎం అన్నంతలా.

బాబుకు చరిత్రలో ఒక పేజి కచ్చితంగా ఉంటుంది. బాబు ఒక చరిత్ర. ఏపీ రాజకీయాల్లో బాబు ముందు బాబు తరువాత అన్నంతగా ఆయన ముద్ర బలంగా ఉండబోతోంది. దానికి అనేక ఫ్యాక్టర్లు బాబు కృషి ఉన్నాయి. వాటిలో జగన్ అనుభవరాహిత్యం తో కూడిన అయిదేళ్ళ పాలన కూడా తోడు అయింది. అందుకే ఏపీ జనాలు పొరపాటున కూడా బాబుని ఎప్పటికీ వదులుకోరు. ఇక ఇప్పటప్పట్లో బాబుకు దరిదాపుల్లో కూడా నిలిచే నేత కూడా ఎవరూ లేరు అన్నది వాస్తవం.

Tags:    

Similar News

eac