‘కెనడా నాట్ ఫర్ సేల్’... ట్రంప్ కు సంచలన సందేశం!

కెనడాపై ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చేసిన విలీన ప్రతిపాదన వ్యాఖ్యలను తాజాగా ఖలీస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ తీవ్రంగా ఖండించారు.

Update: 2025-01-13 13:30 GMT

మరో వారం రోజుల్లో అమెరికాకు కాబోయే అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు నుంచే పొరుగునున్న దేశాలపై ట్రంప్ తీవ్ర సంచలన కామెంట్లు చేశారు. ఇందులో ప్రధానంగా తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా నిలవాలంటూ ఆయన పలుమార్లు ప్రతిపాదించారు.

దీనికి కెనడాలోని చాలా మంది ప్రజలు ఆమోదయోగ్యమైన అభిప్రాయంతో ఉన్నారని.. ఈ విషయం గ్రహించే జస్టిన్ ట్రూడో తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో కెనడా నుంచి ట్రంప్ కు ఓ ఆసక్తికర మెసేజ్ అందింది! అది పంపించింది ఖలీస్థానీ మద్దతుదారు జస్మిత్ సింగ్.

అవును... కెనడాపై ట్రంప్ ఇప్పటికే పలుమార్లు చేసిన విలీన ప్రతిపాదన వ్యాఖ్యలను తాజాగా ఖలీస్థానీ మద్దతుదారు, నేషనల్ డెమోక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా... డొనాల్డ్ ట్రంప్ కు తాను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నట్లు పేర్కొంటూ ఓ వీడియో విడుదల చేశారు.

ఇందులో భాగంగా... తాము తమ దేశాన్ని (కెనడా) ఎప్పటీకీ అమ్మకానికి పెట్టమని.. మీరు (ట్రంప్) కోరుకుంటున్నది ఇప్పుడే కాదు, ఎప్పటికీ జరగదని.. తమ దేశంపై తమకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయని.. ట్రంప్ నుంచి దాన్ని రక్షించుకోవడానికి ఎలాంటి పోరాటానికైనా తామంతా సిద్ధంగా ఉన్నామని జగ్మిత్ సింగ్ అన్నారు.

ఇదే సమయంలో... అమెరికాలో గత కొన్ని రోజులుగా లాస్ ఏంజెలెస్ లో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తున్న సమయంలో.. భవనాలకు అంటుకున్న మంటలను ఆర్పడానికి తమ అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారని.. అదే తమ వ్యక్తిత్వమని జగ్మిత్ సింగ్ తెలిపారు. తము తమ పొరుగుదేశాలకు మద్దతు ఇస్తామని అన్నారు.

అయితే డొనాల్డ్ ట్రంప్ మాత్రం కెనడాపై సుంకాలు విధిస్తామని అంటున్నారని.. అదే జరిగితే.. దానికి అమెరికా ప్రతిఫలం చెల్లించుకోవాల్సి ఉంటుందని.. అమెరికాపై తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తామని ఆయన అన్నారు.

Tags:    

Similar News