ఫోర్డ్ గర్వాన్ని అణిచిన టాటా... 'నీల్ ఆర్మ్ స్ట్రాంగ్' క్షణం గురించి తెలుసా?

ఇది వ్యక్తిగతంగా అయినా, వ్యాపార పరంగా అయినా అత్యంత సహజమైన విషయంగా భవిస్తుంటారని చెబుతుంటారు.

Update: 2024-10-11 04:58 GMT

సాధారణంగా ఎవరికైనా.. ఎక్కడైనా.. ఏదైనా అవమానం జరిగితే.. సహజంగా చాలా మంది తమను అవమాన పరిచిన వారిని మరింత అవమాన పరచాలనో, వారు కష్టాల్లో ఉంటే చూసి సంతోషించాలనో భావిస్తుంటారని అంటారు. ఇది వ్యక్తిగతంగా అయినా, వ్యాపార పరంగా అయినా అత్యంత సహజమైన విషయంగా భవిస్తుంటారని చెబుతుంటారు.

అయితే మిగిలిన వారికీ రతన్ టాటాకు ఉన్న చాలా వ్యత్యాసాల్లో ఇదీ ఒకటి. తనను అవమానించిన వారు కష్టాల్లో ఉంటే ఆదుకున్నారు. తన స్థాయిని, తన గొప్ప మనసును, తన ఆలోచనా విధానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు. దీని వెనుకున్న అసలు స్టోరీ మొత్తం తెలియాలంటే... ఈ కథనం చదవాల్సిందే!

అవును... భారతీయ సంస్థ టాటా.. బ్రిటీష్ కార్ల దిగ్గజం ఫోర్డ్ మోటార్స్ కి చెందిన జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ ని కొనుగోలు చేసి సత్తా చాటింది.. ప్రపంచ వేదికపై భారతదేశ కార్పొరేట్ ఉనికి బలాన్ని బలంగా చాటింది.. ఈ చారిత్రాత్మక కనుగోలుని భారతదేశ "నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ క్షణం" గా ప్రశంసించారు!

వివరాళ్లోకి వెళ్తే... 1998లో టాటా మోటార్స్ తొలి స్వదేశీ రూపకల్పన కారు "ఇండికా"ను తీసుకొచ్చింది. ఈ కారు రతన్ టాటాకు అత్యంత ప్రత్యేకమైనది. అయితే... ఆయన అనుకున్న స్థాయిలో భారత్ లో ఇండికా అమ్మకాలు జరగలేదు. దీంతో... నష్టాలను తగ్గించుకునేందుకు రతన్ జీ ఓ ఆలోచన చేశారు.

ఇందులో భాగంగా... తన ప్రొడక్షన్ యూనిట్ ను బ్రిటీష్ కార్ మేకర్ "ఫోర్డ్" కి విక్రయించాలనుకున్నారు. దీంతో.. ఫోర్డ్ సీబీవో బిల్ ఫోర్డ్ ను కలిసేందుకు 1999లో అమెరికాకు వెళ్లారు. అయితే... ఆటో మోటివ్ రంగంలో టాటా మోటార్స్ కి బిజినెస్ లేదంటూ.. రతన్ టాటాను బిల్ ఫోర్డ్ తక్కువ చేసి మాట్లాడారు.

ఆ తర్వాత ఇండియాకు తిరిగొచ్చిన రతన్ జీ... టాటా మోటార్స్ ని బలమైన ఆటోమేకర్ కంపెనీగా తీర్చిదిద్దాలని బలంగా ఫిక్సయ్యారు. మంచివాళ్లకు ప్రకృతి ఎప్పుడూ సహరిస్తుందన్నట్లు... కాల క్రమేణా ఇండికా కారు సూపర్ సక్సెస్ అయ్యింది. 2007 నాటికి ఇండికా దేశీయ అమ్మకాల్లో 1,42,000 యూనిట్లను విక్రయించింది.

ఇదే సమయంలో టాటా మోటార్స్ ఇండియాని ఆఫ్రికన్, యూరోపియన్ మార్కెట్లకు కూడా ఎగుమతి చేసింది. టాటా పరిస్థితి అలా ఉంటే... కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనే విషయం ఫోర్డ్ కి తెలిసే సమయం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఆర్థిక మాంద్యంలో చిక్కుకున్న ఫోర్డ్.. దివాళా అంచుకు చేరింది!

ఈ సమయంలో తనదైన వ్యాపార చతురతతో ఫోర్డ్ నుంచి జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ ని టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. టాటా నాయకత్వంలో జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ బలంగా పుంజుకుంది. టాటా మోటార్స్ కి ఆటోమోటివ్ రంగంలో బిజినెస్ లేదని చెప్పినవారు దివాళా తీస్తుంటే... వారిని ఆదుకుని, తన విలువలను, భారతీయుడి సత్తాను చాటారు రతన్ టాటా!!

Tags:    

Similar News