ట్రంప్ పట్టాభిషేకం.. భారత్ నుంచి అతిథి.. మోదీ కాదు మరెవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 4నే ముగిశాయి. మరొక్క రెండు రోజుల వ్యవధిలోనే విజేత ఎవరో స్పష్టంగా తెలిసిపోయింది.

Update: 2025-01-12 23:30 GMT

అమెరికాలో ఈ జనవరి 20 నుంచి కొత్త శకం మొదలుకానుంది. అసమర్థ అధ్యక్షుడిగా ముద్ర వేసుకున్న జో బైడెన్ (రిపబ్లికన్) తప్పుకొని డెమోక్రటిక్ పార్టీ తరఫున గెలిచిన డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పీఠంపై కూర్చోనున్నారు. ఒకసారి అధ్యక్షుడిగా చేసి.. ఎన్నికల్లో ఓడిపోయి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక మిగిలింది ఆయన పట్టాభిషేకమే.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 4నే ముగిశాయి. మరొక్క రెండు రోజుల వ్యవధిలోనే విజేత ఎవరో స్పష్టంగా తెలిసిపోయింది. వాస్తవానికి ఓట్ల లెక్కింపు మొదలైన కొంతసేపటికే వాతావరణం అర్థమైంది. డొనాల్డ్ ట్రంప్ కనీవినీ ఎరుగని మెజారీటీతో అధికారం దక్కించుకోబోతున్నారని స్పష్టమైంది. కాగా, అమెరికాలో నవంబరు తొలి వారంలోనే ఎన్నికలు పూర్తయినా.. గెలిచిన నాయకుడు జనవరి 20న బాధ్యతలు స్వీకరించడం సంప్రదాయంగా వస్తోంది.

ఈ నెల 20న ట్రంప్ పట్టాభిషేకం జరగనుంది. అయితే, గతానికి భిన్నంగా ట్రంప్ ఈసారి మరింత దూకుడుతో ఉన్నారు. ప్రమాణం చేసిన రోజే పెను మార్పులు చేస్తారనే కథనాలు వస్తున్నాయి. ఏకంగా 100 ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లను ట్రంప్ కార్యవర్గం సిద్ధం చేసిందట. బైడెన్‌ ఆదేశాల్లో చాలావాటిని ట్రంప్‌ రద్దు చేసే అవకాశాలున్నాయి. వీటిలో ముఖ్యంగా సరిహద్దుల భద్రతకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నారు.

క్యాపిటల్‌ హిల్‌.. 2020లో ట్రంప్ ఓటమి అనంతరం చర్చనీయాంశమైన భవనం. తన మద్దతుదారులను ట్రంప్ రెచ్చగొట్టడంతో వారు ఇక్కడ దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు అదే భవనంలో ట్రంప్ ప్రైవేటు సమావేశంలో ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ల గురించి రిపబ్లికన్ సెనెటర్లకు వెల్లడించారని తెలుస్తోంది.

ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లలో అమెరికా-మెక్సికో సరిహద్దును కట్టడి చేయడం, ఫెడరల్‌ షెడ్యూల్‌ ఎఫ్‌ లో ఉద్యోగుల నిబంధనలు మార్చడం, స్కూల్‌ జెండర్‌ పాలసీలు, టీకాలపై నిర్ణయం వంటివి ఉన్నాయి.

కొత్త అధ్యక్షుడు వచ్చీ రావడంతోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేయడం అమెరికాలో సహజంగా జరిగే ప్రక్రియ. అయితే, వీటిని ఎవరూ ఊహించని రీతిలో జారీ చేసేందుకు ట్రంప్ కార్యవర్గం సిద్ధం అవుతోందట.

ఇక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లకు ముందు ట్రంప్ జనవరి 20న ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి వెళ్లేది ఎవరో తెలిసింది. ట్రంప్ నకు ప్రధాని మోదీ ఎంతో సన్నిహితులనే సంగతి తెలిసిందే. 2020లో ఎన్నికలకు ముందు ఆయన అమెరికా వెళ్లి ట్రంప్ తరఫున అనధికారిక ప్రచారం చేశారు. ఈసారి మాత్రం ఆ పనిచేయలేదు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రమాణానికి మోదీ వెళ్తారా? అనే ఊహాగానాలు వచ్చాయి. కాగా, మోదీ కాకుండా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ట్రంప్ బాధ్యతల స్వీకారానికి హాజరవనున్నారు.

Tags:    

Similar News