జమిలి ఎన్నికల కోసం అన్ని దేశాల్లో అధ్యయనం!

ఇందులో భాగంగా ఆయా దేశాల్లో ఏ రీతిలో ఎన్నికలు నిర్వహిస్తారు.

Update: 2024-09-19 05:00 GMT

జమిలి ఎన్నికల అంశం అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కోవింద్ కమిటీ ఏడు దేశాల్లో జరిగే ఎన్నికల తీరును అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా ఆయా దేశాల్లో ఏ రీతిలో ఎన్నికలు నిర్వహిస్తారు. ఎదురయ్యే సవాళ్లు ఏమిటి? ఎన్నికల నిర్వహణకు అనుసరించే విధానాలు లాంటి వాటితో పాటు.. అందులోని సానుకూలతలు.. ప్రతికూలతలతో పాటు.. సవాళ్లను అధిగమించేందుకు అనుసరించే విధానాలపైనా ఫోకస్ చేశారు.

ఇంతకూ జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ అధ్యయనం చేసిన 7 దేశాల విషయానికి వస్తే..

1. దక్షిణాప్రికా

2. స్వీడన్

3. బెల్జియం

4. జర్మనీ

5. జపాన్

6. ఇండోనేషియా

7. ఫిలిప్పీన్స్

ఈ ఏడు దేశాల్లో కోవింద్ కమిటీ గుర్తించిన అంశాల్నిదేశాల వారీగా చూస్తే..

- దక్షిణాఫ్రికాలో జాతీయ అసెంబ్లీకి.. ప్రొవిన్షియల్ లేజిస్లేజర్లకు ఒకేసారి ఎన్నికల్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత స్థానిక సంస్థలకు ఐదేళ్ల పదవీ కాలానికి ఎన్నికల్ని నిర్వహిస్తారు.

- జర్మనీలో ఛాన్సలర్ నియామకంతో పాటు అదనంగా అవిశ్వాస తీర్మాన సమయంలో వినియోగించుకునే నిర్మాణాత్మక ఓటు ఉంటుంది.

- జపాన్ లో తొలుత ప్రధాని అభ్యర్థిని నేషనల్ డైట్ నిర్ణయిస్తుంది. దానిని రాజు ఆమోదిస్తారు.

- 2019 నుంచి ఇండోనేషియాలో జమిలి ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు.

- స్వీడన్ లో నిర్వహించే జమిలి ఎన్నికల్లో కాస్త భిన్నమైన తీరును అనుసరిస్తారు. పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఇక్కడ పార్లమెంట్.. కౌంటీ కౌన్సిళ్లు.. మున్సిపల్ కౌన్సిళ్లకు ఒకేసారి ఎన్నికల్ని నిర్వహిస్తారు.

- స్వీడన్ లో ప్రతి నాలుగేళ్లకు ఒకసారి సెప్టెంబరు 2 ఆదివారం ఎన్నికల్ని నిర్వహిస్తారు. మున్సిపల్ ఎన్నికలను మాత్రం ఐదేళ్లకోసారి నిర్వహిస్తారు.

Tags:    

Similar News