జనసేన తొలి అభ్యర్ధి ఆయనే...టీడీపీకి నో చాన్స్...!
ఆయన్ని జనసేన అభ్యర్ధిగా తెనాలి నుంచి పోటీకి దించుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. సీటూ మాదే గెలుపూ మాదే అంటూ పవన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం విశేషం.
ఏపీ లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల అధినాయకులు జనం లోకి వస్తున్నారు. దూకుడుగా ప్రసంగాలు చేస్తున్నారు. వాడి వేడిగా మాటల తూటాలు అటూ ఇటూ పేలుతున్నాయి. ఈ సమయంలో అభ్యర్ధుల ఎంపిక అంతా తెర వెనక రహస్యంగా సాగుతోంది. అయితే అధికారం లో ఉన్న వైసీపీ, విపక్షం లో ఉన్న టీడీపీ కంటే ముందుగానే జనసేన తన తొలి అభ్యర్ధిని ప్రకటించింది.
ఆ అభ్యర్ధి ఎవరో కాదు జనసేనాని పవన్ కి వెన్ను దన్నుగా జనసేన లో ఉన్న నాదెంద్ల మనోహర్. ఆయన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన్ని జనసేన అభ్యర్ధిగా తెనాలి నుంచి పోటీకి దించుతున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు. సీటూ మాదే గెలుపూ మాదే అంటూ పవన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం విశేషం.
నిజానికి ఈ సీటు లో టీడీపీకి బలమైన నాయకుడు మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉన్నారు. ఆయన కు 2019 ఎన్నికల లో డెబ్బై వేల దాకా ఓట్లు వచ్చాయి. అదే జనసేన నుంచి పోటీ చేసిన నాదెండ్ల మనోహర్ కి పాతిక వేల లోపు వచ్చాయి. పొత్తు కనుక ఉన్నా కూడా ఆలపాటి రాజావే ఈ సీటు నుంచి పోటీ చేస్తారు అని నిన్నటిదాకా వినిపించిన మాట.
అయితే పవన్ చొరవ తీసుకుని మరీ పొత్తుల కంటే ముందుగానే తమ అభ్యర్ధిని ప్రకటించేశారు. నాదెండ్ల మనోహర్ మంచి అభ్యర్ధి అని ఈసారి ఆయన గెలిస్తే తెనాలి లో అభివృద్ధి అద్భుతంగా సాగుతుందని పవన్ హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ ని గెలిపించడం చాలా అవసరం అని కూడా పవన్ చెప్పడం విశేషం.
పవన్ ఈ విధంగా నాదెండ్ల మనోహర్ ని అభ్యర్ధిగా ప్రకటించి టీడీపీకి షాక్ ఇచ్చారా అన్న చర్చ సాగుతోంది. అసలు వారాహి యాత్ర ప్రారంభం తరువాత పవన్ కళ్యాణ్ జోరు మామూలుగా లేదు అని అంటున్నారు. ఆయన గోదావరి జిల్లాల లో వరసబెట్టి అభ్యర్ధులను ప్రకటిస్తున్నారు. వారిని ఇంచార్జిలుగా ఆయన ప్రకటిస్తున్నా వారే రేపటి అభ్యర్ధులు అని అంటున్నారు.
ఈ విషయూం లో ఆయన పొత్తుల గురించి ఆలోచించడం లేదా అంటే అన్నీ ఆలోచించే ఈ డెసిషన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు. పొత్తులు కనుక ఉన్నా కూడా తమ అభ్యర్ధుల ను బలమైన వారిని నిలబెట్టడానికి పవన్ ముందుకు వస్తున్నారు అని అంటున్నారు. తమకు బలమైన సీట్లు గెలిచే సీట్లు ఉన్నాయని వాటిలో సమర్ధులు విధేయత కలిగిన వారిని దించడం ద్వారా 2024 ఎన్నికల తరువాత ఏపీ లో బలమైన పార్టీగా జనసేన అవతరించాలన్నది పవన్ ఆలోచన. అందువల్లనే ఆయన దూకుడు చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఈ విషయంలో టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే అంటున్నారు.